Hyderabad Crime: తల్లిని హత్య చేసిన గంజాయి బాధితుడు..జీవిత ఖైదు
తల్లిని చంపినా కిరాతకుడికి జీవితఖైదు శిక్షవిధిస్థు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, డి రమాకాంత్ ఉత్తర్వ్యూలు జారీ చేశారు. ఈ దారుణం హైదరాబాద్
- Author : Praveen Aluthuru
Date : 18-07-2023 - 7:33 IST
Published By : Hashtagu Telugu Desk
Hyderabad Crime: తల్లిని చంపిన కిరాతకుడికి జీవితఖైదు శిక్షవిధిస్థు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి, డి రమాకాంత్ ఉత్తర్వ్యూలు జారీ చేశారు. ఈ దారుణం హైదరాబాద్ లోని ఎస్ఆర్ నగర్లో చోటు చేసుకుంది. 2021లో ఈ హత్య జరగగా.. ఈ రోజు జూలై 18న నిందితుడికి జీవితఖైది పడింది.
సంగీత(50) అనే మహిళ తన కొడుకు సంతుతో కలిసి ఎస్ఆర్ నగర్లో నివాసం ఉంటుంది. కొడుకు చదువు మానేసి గంజాయికి అలవాటు పడ్డాడు. గంజాయి సేవించి నిత్యం తల్లిని వేధించేవాడు. డబ్బులు డిమాండ్ చేసేవాడు. అయితే 2021లో సంతు మద్యం తాగేందుకు తల్లిని డబ్బులు అడిగాడు. దాంతో తల్లి నిరాకరించడంతో కత్తితో తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. ఈ కేసుని విచారించి జూలై 18, 2023న మొదటి అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి డి రమాకాంత్ రూ. 10,000 జరిమానాతో పాటుగా అతడిని దోషిగా నిర్ధారించి జీవిత ఖైదు విధించారు.
Also Read: Honor Play 40C: కేవలం రూ.10 వేలకే హానర్ స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?