Onion Price: ఉల్లి ధరలపై మోడీని టార్గెట్ చేసిన ఖర్గే
ఉల్లి ధరల పెరుగుదలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే ఆదివారం మండిపడ్డారు. గత కొద్దీ సంవత్సరాలుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనను బీజేపీ అపహాస్యం చేస్తోందన్నారు.
- By Praveen Aluthuru Published Date - 11:34 AM, Sun - 29 October 23

Onion Price: ఉల్లి ధరల పెరుగుదలపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మలికార్జున్ ఖర్గే ఆదివారం మండిపడ్డారు. గత కొద్దీ సంవత్సరాలుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం మరియు అధిక ధరలకు వ్యతిరేకంగా ప్రజల నిరసనను బీజేపీ అపహాస్యం చేస్తోందన్నారు. ప్రతిసారీ ద్రవ్యోల్బణం సమస్యపై మోడీ ప్రభుత్వం ప్రజలను ఎగతాళి చేస్తూనే ఉందని మండిపడ్డారు. మనం ఇతర దేశాల కంటే మెరుగైన స్థానంలో ఉన్నామని చెప్పారు
దేశంలో మళ్ళీ ఉల్లిపాయల ధరలు ఎందుకు పెరిగాయో చెప్పాలని డిమాండ్ చేశారు. రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి ప్రజలు సమాధానం చెబుతారని స్పష్టం చేశారు. గతంలో పాల ధరల పెరుగుదలపై మోడీని ఖర్గే టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. దేశంలో పాల ధరలు పెరగడానికి బీజేపీ దుష్పరిపాలనే కారణమని మల్లికార్జున్ ఖర్గే విమర్శించారు. ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా ఉన్న భారత్.. బీజేపీ అస్తవ్యస్త పాలన పుణ్యమాని ఇప్పుడు పాల కొరతను ఎదుర్కొంటోందన్నారు. కాగా గత వారం ఉల్లి ధరలు దాదాపు 50 శాతానికి చేరుకున్నాయి. కూరగాయల నాణ్యతను బట్టి ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కిలో రూ. 60-80కి అమ్ముడవుతోంది.
Also Read: Mukesh Ambani – Death Threat : ముకేశ్ అంబానీకి మరోసారి ఈమెయిల్ వార్నింగ్.. రూ.200 కోట్లు డిమాండ్