Smriti Irani : హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ దిష్టిబొమ్మ దహనం
స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు.
- Author : Prasad
Date : 30-07-2022 - 11:18 IST
Published By : Hashtagu Telugu Desk
స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ నేతలు నిరసన చేపట్టారు. గాంధీభవన్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా స్మృతి ఇరానీ దిష్టిబొమ్మను నేతలు దహనం చేశారు. గోవాలో అక్రమంగా బార్ లైసెన్స్ పొందిన తన కుమార్తె జోయిష్ ఇరానీపై ప్రజల దృష్టి మరల్చేందుకే స్మృతి సోనియాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతరావు ఆరోపించారు. దేశంలోని ప్రజలందరూ భారత రాష్ట్రపతిని గౌరవిస్తారని, తమ పార్టీ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి ఇప్పటికే ఈ అంశంపై క్షమాపణలు చెప్పారని ఆమె స్పష్టం చేశారు. సోనియా గాంధీ ఎవరికీ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు.