Earthquake: అసోంలో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
అసోంలో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున అసోంలో రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది.
- By Gopichand Published Date - 10:06 AM, Wed - 8 March 23

అసోంలో భూకంపం (Earthquake) సంభవించింది. బుధవారం తెల్లవారుజామున అసోంలో రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 3:59 గంటలకు కమ్రూప్ జిల్లాలో 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Also Read: Earthquake in Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌ను వణికించిన భూకంపం.. 4.2 తీవ్రతగా నమోదు
ఫిబ్రవరి 28న గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. దాదాపు మధ్యాహ్నం 3:21 గంటలకు 10 కి.మీ లోతులో ప్రకంపనలు వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ధృవీకరించింది.

Related News

Afghanistan: ఆఫ్ఘనిస్థాన్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతగా నమోదు
ఆఫ్ఘనిస్థాన్ (Afghanistan)లో బుధవారం తెల్లవారుజామున రిక్టర్ స్కేలుపై 4.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం.. ప్రకంపనలు ఉదయం 5:49 (IST)కి సంభవించాయి.