MP Night Curfew:నైట్ కర్ఫ్యూ ప్రకటించిన ప్రభుత్వం
దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పేలా లేవనే చర్చ జరుగుతోంది. రానున్న డిసెంబర్ 31, జనవరి 1 న జరిగే వేడుకల్లో పబ్లిక్ గ్యాదరింగ్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని కేంద్రం భావిస్తోంది.
- By Siddartha Kallepelly Published Date - 11:40 PM, Thu - 23 December 21

దేశ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్ పరిస్థితులు తప్పేలా లేవనే చర్చ జరుగుతోంది. రానున్న డిసెంబర్ 31, జనవరి 1 న జరిగే వేడుకల్లో పబ్లిక్ గ్యాదరింగ్ లో మరిన్ని కేసులు పెరిగే అవకాశముందని కేంద్రం భావిస్తోంది. రాష్ట్రాల పరిస్థితులను గమనించి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించిన నేపధ్యంలో రాష్ట్రాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నాయి.
పెరుగుతున్న ఓమిక్రాన్ కేసులను కట్టడి చేసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్ లో ఇప్పటివరకు ఒక్క ఓమిక్రాన్ కేసు కూడా నమోదు కాలేదు. అయితే కేంద్రం సూచనల మేరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్టు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ముందస్తు చర్యల్లో భాగంగా నైట్ కర్ఫ్యూ విధించినట్టు ప్రభుత్వం ప్రకటించింది.
పలురాష్ట్రాల్లో ఓమిక్రాన్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే మహారాష్ట్రలో కొత్తగా 23 ఒమిక్రాన్ కేసులు, గుజరాత్ లో కొత్తగా మరో 7 కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇండియాలో ఇప్పటి వరకు 361 ఓమిక్రాన్ కేసులు నమోదైనట్టు అధికారులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా గుజరాత్‌లోని 8 నగరాల్లో కూడా నైట్ కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ఢిల్లీలో కూడా క్రిస్మస్, కొత్త సంవత్సరం వేడుకలపై నిషేధం విధించారు.