HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Lokesh Ready For War With Ycp

TDP : యుద్ధానికి సై అంటోన్న చినబాబు…వైసీపీకి మామూలుగా ఉండదు..!!

నారా లోకేష్ కు ...వైసీపీకి మధ్య పంచాయితీ అంత ఈజీగా తగ్గేలా కనిపించడం లేదు. వైసీపీ తప్పులు చేయకుండా ఉంటుందా అంటే అదీ లేదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది.

  • Author : hashtagu Date : 10-06-2022 - 8:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tdp Mlcs Ap Legislative Council
Tdp Mlcs Ap Legislative Council

నారా లోకేష్ కు …వైసీపీకి మధ్య పంచాయితీ అంత ఈజీగా తగ్గేలా కనిపించడం లేదు. వైసీపీ తప్పులు చేయకుండా ఉంటుందా అంటే అదీ లేదు. తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఎందుకుంటే టీడీపీని ఇరకాటంలో పెట్టడమే తమ టార్గెట్ గా ఆ ఇద్దరూ పరితపిస్తున్నారు కాబట్టి. వాళ్లిద్దరే కాదు…గురువారం జరిగిన జూమ్ మీటింగ్ చూసినట్లయితే చాలామంది వైసీపీ నేతలు…చినబాబును టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ తడబడ్డారు. కొన్ని సందర్భాల్లో లోకేష్ ను మాట్లాడనివ్వకుండా కలబడ్డారు. ఏదేమైనా…చినబాబుతో చర్చకు తాము సిద్దమని చెప్పిన ఆ ఇద్దరూ…చినబాబుపై మాటల దాడి కొనసాగించేట్లు కనిపిస్తోంది. కాబట్టి టీడీపీ కూడా సన్నద్దం అయ్యింది. ఇక నుంచి మరింత జోరుపెంచాలని డిసైడ్ అయ్యింది. వార్ వన్ సైడ్ అనేలా…వైసీపీ నాయకుల నైజాన్ని ఆధారాలతో సహా బయటపెట్టాలని ప్లాన్ రెడీ చేసుకుంది టీడీపీ.

ఇక్కడో వాస్తవం చెప్పాలి. పది పాస్ కానీ పిల్లలతో మాట్లాడాలనుకోవడం పెద్ద తప్పేంకాదు. కానీ పద్దతి తప్పిన నాయకుల తీరుతోనే కాస్త గందరగోళం. ఇదే సమయంలో చినబాబు వర్గాలు పూర్తిగా అలర్ట్ అయ్యాయి. రేపటి నుంచి ఏపీడీసీ ద్వారా వైసీపీ అధికారిక కార్యక్రమాల ప్రచారం ఊపందుకోనుంది. వైసీపీ చెప్పే మాటలకు ఆన్ లైన్లో కౌంటర్లు, ఆఫ్ లైన్ కౌంటర్లకు రెడీ అవుతోంది. మూడేండ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలనే టార్గెట్ చేయాలని నిర్ణయించింది.

కాగా లోకేష్ బాబుతోపాటు మిగతా నాయకులు కూడా ప్రత్యక్ష యుద్ధానికి సై అంటున్నారు. అన్నా క్యాంటీన్ల ఏర్పాటుపై వైసీపీ ఏకపక్షంగా వెళ్లడం…జేసీబీల సాయంతో కూల్చేస్తుండటంతో టీడీపీ మరింత అప్రమత్తమయ్యింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కుప్పం, మంగళగిరి నియోజకవర్గాల్లో అదేవిధంగా పులివెందులలో కూడా అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు రెడీ అవుతామని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అంతేకాదు…ప్రభుత్వ వైఫల్యాలను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తామని ఖరాఖండిగా చెబుతున్నారు. చినబాబుకు సపోర్టుగా నిలుస్తూ..పోరాటం చేస్తామని అచ్చెన్న, అయన్న లాంటి ఉత్తరాంధ్ర లీడర్లు అంటున్నారు. వైసీపీ గెట్ రెడీ అంటూ…లోకేశ్ వర్గాలు పదే పదే చెబుతున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ap
  • Lokesh
  • tdp
  • ycp

Related News

    Latest News

    • Snap Chat : స్నాప్ చాట్ తరహాలో ఇన్స్టా నుంచి సరికొత్త యాప్

    • Metro : సర్కార్ చేతుల్లోకి హైదరాబాద్ మెట్రో

    • Gold : వామ్మో అటెండర్ ఇంట్లో బంగారం , వెండి ఎంత ఉందో తెలిస్తే షాకే !!

    • Kavitha Promises : తెలంగాణ రాష్ట్ర ప్రజలపై కవిత హామీల వర్షం

    • Kavitha : కేసీఆర్ ను మర మనిషి తో పోల్చిన కవిత

    Trending News

      • ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ పరిస్థితి విషమం!

      • ఫిఫా వరల్డ్ కప్ 2026.. ఇరాన్ స్థానంలో ఇటలీ?

      • ‘పెద్ది’లో శృతి హాసన్ సందడి

      • ఎన్నిక‌ల త‌ర్వాత భారీగా పెర‌గ‌నున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు?

      • ఆరు నెలల పాటు ఇంధన సంక్షోభం తప్పదా? పెంటగాన్ సంచలన నివేదిక!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd