e-mail Aadhar link: ఈ మెయిల్ ఐడీతో ఆధార్‌ను లింక్ చేస్తే కలిగే బెనిఫిట్స్ ఇవే?
ప్రస్తుతం దేశ ప్రజల గుర్తింపు విషయంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ కార్డు లేకపోతే గుర్తింపు లేనట్టుగా
- By Nakshatra Published Date - 05:35 PM, Wed - 19 October 22
ప్రస్తుతం దేశ ప్రజల గుర్తింపు విషయంలో ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఆధార్ కార్డు లేకపోతే గుర్తింపు లేనట్టుగా భావిస్తున్నారు. అంతేకాకుండా ఆధార్ కార్డు అన్నది ప్రస్తుతం భారతీయులకు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా తయారయింది అని చెప్పవచ్చు. గవర్నమెంట్ ప్రైవేట్ ఇలా దేనికి సంబంధించిన స్కీములు అయినా కూడా ఆధార్ కార్డు అన్నది తప్పనిసరి. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అయితే ఆధార్ కార్డు విషయంలో ఇప్పటికే యుఐడిఎఐ అనేక రకాల విషయాలను ఆధార్ వినియోగదారులకు అందుబాటులో ఉండే విధంగా సౌకర్యంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు కొత్త కొత్త అప్డేట్ అని తీసుకు వస్తూనే ఉంది.
ఇకపోతే ఆధార్ కార్డు తీసుకున్న తర్వాత పదేళ్లు దాటిన తర్వాత వారు తప్పకుండా ఆధార్ కార్డును అప్డేట్ చేయించుకోవాలి యుఐడిఏఐ ఆధార్ వినియోగదారులకు వెల్లడించిన విషయం తెలిసిందే. ఆధార్ కార్డుతో ఈమెయిల్ ఐడిని లింక్ చేయడం ద్వారా పలు బెనిఫిట్స్ పొందవచ్చని యుఐడిఏఐ తెలిపింది. ఈ నేపథ్యంలోనే అధికారిక. ట్విట్టర్ క్యాండిల్ ఖాతా ద్వారా సమాచారాన్ని తెలిపింది. ఆధార్ ను ఈమెయిల్ ఐడి తో లింక్ చేయడం వల్ల మన ఆధార్ కార్డును ఎక్కడ ఉపయోగిస్తున్నారు అనేది తెలుసుకోవడం మరింత సులువవుతుందట.
కొన్నిసార్లు మన అనుమతి లేకుండా ఆధార్ కార్డును ఎవరైనా, కాబట్టి ఆధార్ కి సంబంధించిన ఎటువంటి నేరాలనైనా వెంటనే మనం నిరోధించవచ్చు అని యుఐడిఏఐ వెల్లడించింది. ఆధార్ కార్డుతో లింకు అయ్యి ఉన్న బ్యాంకు ఖాతాల నుంచి మోసం జరిగిన సందర్భాలలో సమాచారం పొందడం కోసం వీలుంటుందని, అప్పుడు ఇటువంటి మోసాలు జరగకుండా బ్యాంకు సిబ్బందితో సహకరించవచ్చని యుఐడిఏఐ తెలిపింది. సైబర్ నేరగాళ్లు ఆధార్ ని దుర్వినియోగం చేస్తూ ఆర్థిక మోసాలకు పాల్పడుతూ ఆ కార్యకలాపాలను ఆధార్ కార్డును విరివిగా ఉపయోగిస్తున్నారు. అటువంటి నేరలను అరికట్టడం కోసం ఆధార్ ను ఈమెయిల్ తో లింక్ చేయాలని యుఐడిఎఐ సలహా ఇచ్చింది.
Related News
Aadhaar As Date Of Birth Proof: ఇక నుండి ఆధార్.. డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, ఉత్తర్వులు జారీ..!
లోక్‌సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.