KTR Press Meet : రేపు మ.12 గంటలకు కేటీఆర్ ఏంచెప్పబోతున్నాడు..?
KTR Press Meet : రేపు కేటీఆర్ ప్రెస్‌మీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ వాదనలు ఎలా వినిపించబోతున్నారన్న దానిపై దృష్టి నెలకొంది
- By Sudheer Published Date - 08:04 PM, Mon - 5 May 25

తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడి రాజేసేలా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి తీవ్ర విమర్శలు చేసారు. “మీరు, మీ కాంగ్రెస్ – నైతికంగా దెబ్బతిన్నారు, ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీశారు” అని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ, రేపు మధ్యాహ్నం (మే 06) 12 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తానని ప్రకటించారు.
Met Gala 2025 : ‘మెట్ గాలా’కు ఏడుగురు భారతీయులు.. ఏమిటిది ? షాకింగ్ రూల్స్ !
తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా దివాలా తీయలేదని స్పష్టంగా ప్రకటించిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేలా మాట్లాడారు. రాష్ట్రంలో పెరుగుతున్న అప్పులు, కేంద్ర పథకాల అమలులో నిర్లక్ష్యం, ప్రజాపాలనలో పారదర్శకత లోపించిందని ఆయన విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తీసుకున్న అభివృద్ధి చర్యలను, నేడు కాంగ్రెస్ పాలనతో పోల్చే ప్రయత్నం ఉండే అవకాశముంది.
Romance : వెరైటీ గా శృంగారం చేద్దామనుకొని భార్యనే చంపేసిన భర్త
రేపు కేటీఆర్ ప్రెస్‌మీట్‌పై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వానికి ప్రత్యామ్నాయ వాదనలు ఎలా వినిపించబోతున్నారన్న దానిపై దృష్టి నెలకొంది. రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శలు , ఆరోపణలు , కీలక వ్యాఖ్యలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మీడియా సమావేశం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించే అవకాశం ఉంది.
Telangana state is Not bankrupt Mr. Cheap Minister
It is you & your corrupt Congress party that is intellectually bankrupt and morally bereft
Will address a PC on the issue of state finances at 12 Noon tomorrow #CongressFailedTelangana
— KTR (@KTRBRS) May 5, 2025