KTR: ఫౌండర్స్‌ల్యాబ్ స్టార్టప్ కంపెనీని ప్రారంభించిన కేటీఆర్
ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన చొరవతో హైదరాబాద్ కు అనేక రంగాలు తరలి వచ్చాయి.
- Author : Praveen Aluthuru
Date : 19-07-2023 - 7:00 IST
Published By : Hashtagu Telugu Desk
KTR: ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో మంత్రి కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన చొరవతో హైదరాబాద్ కు అనేక రంగాలు తరలి వచ్చాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు నగరానికి క్యూ కట్టాయి. ఇక లోకల్ టాలెంట్ ను సైతం మంత్రి కేటీఆర్ ప్రోత్సహిస్తారు. ఈ రోజు మంత్రి కేటీఆర్ ఫౌండర్స్‌ల్యాబ్ అనే స్టార్టప్ కంపెనీని ప్రారంభించారు.హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ కార్యాలయంలో ప్రారంభోత్సవం జరిగింది. టి-హబ్, డబ్ల్యుఇ హబ్, టి-వర్క్స్, రిచ్ మరియు అగ్రి హబ్‌ల ద్వారా రాష్ట్రంలో కొత్త పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని కెటిఆర్ చెప్పారు. ఫార్మా, అగ్రికల్చర్, మేనేజ్‌మెంట్ మరియు ఇంజినీరింగ్ వంటి విభిన్న రంగాలను అనుసంధానం చేయడం ద్వారా ప్రభావవంతమైన ఆవిష్కరణలు పుట్టుకొస్తాయని ఫౌండర్స్‌ల్యాబ్ CEO మరియు వ్యవస్థాపకురాలు శకుంతల కాసరగడ్డ తెలిపారు. ప్రభుత్వం సహాయంతో ఫౌండర్స్‌ల్యాబ్ విద్యార్థులు అత్యుత్తమ వ్యవస్థాపకులుగా తీర్చిదిద్దుతుందని ఆమె అన్నారు. ఫౌండర్స్‌ల్యాబ్ దేశవ్యాప్తంగా ఉన్న విద్యా సంస్థలు, విశ్వవిద్యాలయాలు మరియు ఇంజినీరింగ్ కళాశాలలతో పని చేస్తుంది.
Read More: Telangana: భారీ వర్షాలు.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్