Nellore TDP Incharge : నెల్లూరు రూరల్ టీడీపీ ఇంఛార్జ్‌గా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియమితులయ్యారు.
- Author : Prasad
Date : 25-07-2023 - 8:56 IST
Published By : Hashtagu Telugu Desk
నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్‌గా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నియమితులయ్యారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇకపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నేతృత్వంలో పార్టీ కార్యక్రమాలు జరుగుతాయని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు కార్యకర్తలు, నాయకులు సహకరించాలని కోరారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలో వైసీపీ నుంచి సస్పెన్షన్‌కు గురై టీడీపీలో చేరారు. ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇప్పటికే టీడీపీలో చేరారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం చేయడంలో అన్నదమ్ములిద్దరూ కీలక పాత్ర పోషించారు. కోటంరెడ్డి బ్రదర్స్ చేరికతో నెల్లూరు టీడీపీకి బలం చేకురింది.