Kishan Reddy : తెలంగాణ ఆర్థిక పరిస్థితి దివాళా తీసింది..
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా రాష్ట్రాలు ముందుకు సాగలేనన్న వాస్తవాన్ని మరోసారి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు.
- By Kavya Krishna Published Date - 04:29 PM, Sat - 7 June 25

Kishan Reddy : కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా రాష్ట్రాలు ముందుకు సాగలేనన్న వాస్తవాన్ని మరోసారి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తేల్చిచెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై అధికంగా ఆధారపడి ఉన్నాయని, ముఖ్యంగా బియ్యం, ఎరువుల వంటి ప్రాధమిక అవసరాల విషయాల్లో కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. “సన్న బియ్యంలో కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు 80 శాతం ఉంటాయి. అలాగే ఎరువులపై 70 శాతం సబ్సిడీ కేంద్రం కల్పిస్తోంది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు తగిన సేవలు అందించడంలో విఫలమవుతోంది” అని విమర్శించారు.
Physical Harassment: ఐసీయూలో ఉన్న మహిళపై అత్యాచారం..!
అదే సమయంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై తీవ్రంగా స్పందించిన కిషన్ రెడ్డి, రాష్ట్రం ఇప్పటివరకు దాదాపు రూ. 10 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందన్నారు. అప్పులు చేసేందుకు కూడా ఇప్పుడు రాష్ట్రానికి మార్గాలు దొరకడం లేదని, ఇది రాష్ట్ర పాలకపక్షాల అవ్యవస్థిత పాలన ఫలితమని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బాధ్యతలేని విధంగా నిధులను వినియోగించడమే ఈ స్థితికి దారితీసిందని వ్యాఖ్యానించారు.
Jaishankar : దుష్టులు బాధితులతో సమానం కాదు..భారత్ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదు : జైశంకర్
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాలని కలలు కంటున్నప్పటికీ, ప్రజలు ఇప్పుడు నిజాలను గుర్తించి బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రాష్ట్రం ప్రస్తుతం ఆర్థికంగా, పరిపాలనాపరంగా తీవ్ర సంక్షోభంలో ఉందని పేర్కొంటూ, దానికి గల అసలైన కారణాలను ప్రజలు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు. కేంద్రం మాత్రమే రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి బయటపడేస్తుందని, బీజేపీ పరిపాలనలో మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.