BJP Hunger Strike: కిషన్ రెడ్డి అరెస్ట్
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ అన్యాయం చేశాడంటూ నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ బీజేపీ ఉపవాస దీక్ష చేపట్టింది. 24 గంటల పాటు దీక్షను కొనసాగించాలని
- By Praveen Aluthuru Published Date - 08:25 PM, Wed - 13 September 23

BJP Hunger Strike: నిరుద్యోగులను సీఎం కేసీఆర్ అన్యాయం చేశాడంటూ నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ బీజేపీ ఉపవాస దీక్ష చేపట్టింది. 24 గంటల పాటు దీక్షను కొనసాగించాలని ఉదయం నుంచి దీక్షలో పాల్గొన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయితే కొద్దిసేపటి క్రితమే పోలీసులు కిషన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు అనుమతి ఉందంటూ పోలీసులు అరెస్ట్ కు ప్రయత్నం చేయడంతో కొద్దిసేపు హైడ్రామా నడిచింది. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో పోలీసులు కిషన్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.
Also Read: Libya Floods: లిబియాలో భారీ వర్షాలు.. 5,000 మంది మృతి