Kishan Reddy: వరంగల్ పోర్టుకు నూతన లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నాం : కిషన్ రెడ్డి
- By Balu J Published Date - 09:08 PM, Tue - 13 February 24

Kishan Reddy: వేయి స్తంబాల గుడి మండపం పనులను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మంగళవారం పరిశీలించారు. తరువాత మీడియా తో మాట్లాడారు. హనుమకొండలోని కాకతీయుల కాలం నాటి శ్రీ రుద్రేశ్వర స్వామివారి వేయిస్తంభాల గుడి కల్యాణ మండపం పనులు పూర్తయ్యాయి. కొన్ని స్తంభాలను కొత్తగా నిర్మించడం జరిగింది. ఫిబ్రవరి చివరి వారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి మండపాన్ని భక్తులకు అంకితం చేస్తాం.
తెలంగాణలో రామప్ప దేవాలయాన్ని రూ. 60 కోట్లతో పర్యాటకులకు వసతులు కల్పిస్తున్నాం. దేవాలయంలో ద్వంసమైన ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ద్వారా నిర్మితమవుతోంది. వరంగల్ పోర్టుకు నూతన లైటింగ్ సిస్టమ్ ను ఏర్పాటు చేస్తున్నాం. ట్రైబల్ సర్క్యూట్ పేరుతో పరిసర ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో గెస్ట్ హౌస్ లు, బోట్లు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందించాం. ములుగులో సమ్మక్క-సారక్క గిరిజన యూనివర్సిటీ మంజూరు చేయడం జరిగిందని అన్నారు.