HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kerala Woman Gang Raped By Rapido Bike Driver And Associate In Bengaluru

Bengaluru Rapido Driver: ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారం…

బెంగళూరులో ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • Author : Maheswara Rao Nadella Date : 30-11-2022 - 11:05 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rape
Rape

బెంగళూరులో ర్యాపిడో బైక్ డ్రైవర్, అతడి స్నేహితుడు కలిసి కేరళ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. శుక్రవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులకు బాధితురాలు చేసిన ఫిర్యాదు ప్రకారం శుక్రవారం రాత్రి తన ఫ్రెండ్ ఇంటికొచ్చిన యువతి అక్కడ నుంచి మరో ఫ్రెండ్‌ను కలిసేందుకు ర్యాపిడో బైక్‌ను బుక్ చేసుకుంది. అప్పటికే ఆమె ఫుల్లుగా మద్యం సేవించడం వల్ల గమ్యస్థానానికి వచ్చినా మత్తులో బైక్ దిగకపోవడంతో బైకర్ నేరుగా ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. తన స్నేహితుడ్ని పిలిచి ఇద్దరూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.

మర్నాడు ఉదయం స్పృహ‌లోకి వచ్చిన యువతి భయంకరమైన నొప్పికి గురయ్యింది. దీంతో తనపై అత్యాచారం జరిగినట్టు గ్రహించింది. నిందితుడు ఇంటి నుంచి తన గదికి చేరుకుని, శరీరం సహకరించకపోవడంతో సమీపంలోని సెయింట్ జాన్స్ ఆస్పత్రికి వెళ్లింది. యువతిని పరీక్షించిన వైద్యులు అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బాధితురాలిపై అత్యాచారం జరిగే సమయంలో నిందితుడి ఇంటిలో మరో మహిళ ఉండగా ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమెను పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన మహిళగా గుర్తించారు. బాధిత యువతిపై అత్యాచారం జరుగుతుంటే అడ్డుకోవాల్సింది పోయి నిందితులకు సహకరించిందని పోలీసులు తెలిపారు.

ఘటనా స్థలంలో ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీసులు ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించినట్లు బెంగళూరు కమిషనర్‌ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ‘‘యాప్‌లో భద్రత మెరుగుదలలను నిర్ధారించడానికి వాటి యాజమాన్యాలను పిలిపించి సూచనలు చేస్తాం’ అని ఆయన చెప్పారు. నిందితుల్లో ఒకరికి క్రిమినల్ రికార్డ్ ఉన్నట్లు కనిపిస్తున్నందున వారి నేపథ్యాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారని ఆయన వివరించారు. నిందితులను షాబుద్దీన్ (26), అక్తర్ (24)గా ఆ మహిళను షాబుద్దీన్ గర్ల్‌ ఫ్రెండ్‌గా గుర్తించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bengaluru
  • crime
  • kerala
  • rape
  • rapido
  • Rapido driver
  • women

Related News

BCCI Issues Key Directives to Hardik and Rohit

BCCI: హార్దిక్‌, రోహిత్‌లకు బీసీసీఐ కీలక ఆదేశాలు

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక కీలక నిర్ణయంతో టీమిండియా స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలపై కఠిన వైఖరిని ప్రదర్శించింది. త్వరలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ముందు, వీరిద్దరినీ తక్షణమే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన సన్నాహక శిబిరానికి రిపోర్ట్ చేయాలని బోర్డు ఆదేశించింది. రాబోయే సిరీస్ కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్, సంస

  • Real Estate Fraud

    Fraud :సూర్యాపేట‌లో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి భారీ మోసం

  • Southwest Monsoon

    Rains: నైరుతి రుతుపవనాలు మరింత ఆలస్యం

Latest News

  • Importance of Marriage: పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం తెలుసా?

  • PM Modi: జవహర్‌లాల్ నెహ్రూ రికార్డు బ్రేక్ చేయబోతున్న ప్రధాని మోడీ.

  • DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప‍్రమాణం

  • CM Chandrababu: తెలంగాణలో పవన్ సభపై స్పందించిన చంద్రబాబు

  • Khushboo: సీఎం విజయ్‌ని కలిసి కూతురి వెడ్డింగ్ కార్డ్ ఇచ్చిన ఖుష్బూ దంపతులు

Trending News

    • Kalita Majhi: అప్పట్లో ఇంటి పనిమనిషి.. నేడు బెంగాల్‌ మంత్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd