Rise In Dengue Cases : కేరళలో పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. ఏడు జిల్లాల్లో అలెర్ట్
కేరళలో డెంగ్యూ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం ఏడు జిల్లాల్లో...
- Author : Prasad
Date : 16-11-2022 - 8:00 IST
Published By : Hashtagu Telugu Desk
కేరళలో డెంగ్యూ కేసులు రోజురోజుకి పెరుగుతున్నాయి. డెంగ్యూ జ్వరాలు వ్యాప్తి చెందకుండా కేరళ ప్రభుత్వం ఏడు జిల్లాల్లో అలర్ట్ ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లం, అలప్పుజా, ఎర్నాకులం, పాలక్కాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో డెంగ్యూ కేసులు పెరుగుతున్నందున ఆయా జిల్లాల్లో అప్రమత్తం చేసినట్లు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ వివరాలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, ఇళ్లు శుభ్రం చేయడం, నిలిచిపోయిన నీటిని తొలగించడం ద్వారా ప్రతి వారం డ్రై డే క్యాంపెయిన్ పాటించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జార్జ్ పేర్కొన్నారు. ఇతర జిల్లాలు కూడా అప్రమత్తంగా ఉండాలని.. దోమల ఉత్పత్తి ప్రదేశాలను నిర్మూలించడంలో నిమగ్నమై ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున అనేక చోట్ల నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నందున డెంగ్యూ నివారణ చర్యలను వేగవంతం చేయాలని మంత్రి అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వివిధ జిల్లాల్లో పరిస్థితిని సమీక్షించేందుకు మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.