HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kerala High Court Comments On Womans Naked Upper Body

Naked Upper Body : మహిళ శరీరం ఎగువ భాగాన్ని సెక్సువల్ కోణంలో చూడొద్దు : కేరళ హైకోర్టు

కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళ శరీరం ఎగువ భాగాన్ని(Naked Upper Body) అశ్లీల కోణంలో లేదా సెక్సువల్ కోణంలో చూడొద్దని సూచించింది.

  • Author : Pasha Date : 05-06-2023 - 9:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Court

కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మహిళ శరీరం ఎగువ భాగాన్ని(Naked Upper Body) అశ్లీల కోణంలో లేదా సెక్సువల్ కోణంలో చూడొద్దని సూచించింది. స్త్రీ, పురుషుల శరీర ఎగువ భాగాలను చూసే విషయంలో, వాటిపై అభిప్రాయాలను ఏర్పర్చుకునే విషయంలో సమాజం చూపే వ్యత్యాసంపై న్యాయస్థానం పలు ప్రశ్నలు లేవనెత్తింది. నగ్నత్వం, అశ్లీలత ఎల్లప్పుడూ పర్యాయపదాలు కావని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ తేల్చి చెప్పారు. పోక్సో ఆరోపణలను ఎదుర్కొంటున్న మహిళా హక్కుల కార్యకర్త రేహానా ఫాతిమాను సోమవారం నిర్దోషిగా ప్రకటించారు. రేహానా.. శరీరం ఎగువ భాగంపై (Naked Upper Body)  తన మైనర్ పిల్లలతో పెయింటింగ్ వేయించుకున్న వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆమెపై పోక్సో చట్టం కింద కేసును నమోదు చేశారు.

Also read : Sex Racket: భోజ్‌పురి నటి, మోడల్‌తో సెక్స్ రాకెట్.. గుట్టు రట్టు చేసిన పోలీసులు, ముగ్గురు అరెస్టు

“ఆ మహిళ తన శరీరాన్ని కాన్వాస్‌లా చిత్రించుకునేందుకు పిల్లలకు అనుమతినిచ్చింది. తన శరీరం గురించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం స్త్రీ హక్కు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ఆమెకు ఆ స్వాతంత్ర్యం ఇస్తుంది. అది లైంగిక చర్య కాదు.. అశ్లీల చర్య కాదు” అని జస్టిస్ కౌసర్ ఎడప్పగత్ స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో పోక్సో ఆరోపణల నుంచి మహిళా హక్కుల కార్యకర్తను నిర్దోషిగా ప్రకటించారు. “దేశమంతటా ఉన్న పురాతన దేవాలయాలలోని కుడ్యచిత్రాలలోనూ ఇటువంటి నగ్న శిల్పాలు, పెయింటింగ్‌ లు ఉన్నాయి. వాటిని మనం కేవలం కళగా పరిగణిస్తాం. పవిత్ర భావంతో చూస్తాం. దేవతలందరి విగ్రహాలు వట్టి ఛాతీతో ఉన్నప్పటికీ ఆలయంలో ప్రార్థనలు చేస్తుంటాం. అక్కడ మనకు సెక్సువల్ భావాలు ఉండవు.. కేవలం భక్తిభావం మాత్రమే మనలో ఉంటుంది” అని కోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • comments
  • default
  • kerala high court
  • naked upper body
  • woman
  • womans naked upper body

Related News

High Court issues key orders to provide security for the 'Kumbh Mela Mona Lisa'.

Monalisa: కుంభమేళా మోనాలిసాకు భద్రత కల్పించండి హైకోర్టు కీలక ఆదేశాలు

ఫేస్‌బుక్ ప్రేమ, మతాంతర వివాహం, కిడ్నాప్ కేసులతో జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన కుంభమేళా మోనాలిసా ఉదంతంలో కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. పెద్దలను ఎదిరించి ముస్లిం యువకుడిని పెళ్లాడిన తనకు పుట్టింటివారి నుంచి తీవ్ర ప్రాణహాని ఉందంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం సానుకూలంగా స్పందించింది. పిటిషన్ తేలేవరకు ఆమె ప్రాణాలకు పూర్తి భద్రత కల్పించాలని కేరళ పోల

    Latest News

    • Telegram: మళ్లీ టెలిగ్రామ్ సేవలు అందుబాటులోకి

    • George Kurian: కేంద్ర మంత్రి పదవికి జార్జ్ కురియ‌న్ రాజీనామా

    • Men Skincare: మగవారికి కూడా మెరిసే చర్మం కావాలంటే ఇలా చేయాల్సిందే!

    • Nitish Kumar Reddy: నితీశ్ కుమార్ రెడ్డికి గాయం.. ఐర్లాండ్ సిరీస్‌కు దూరం.. ఇంగ్లాండ్‌ టూర్‌కూ అనుమానమే.?

    • Anna Hazare: మహారాష్ట్ర ఆర్టీఐ నిబంధనల సవరణలను రద్దు చేయకపోతే.. జులై 5 నుంచి నిరవధిక నిరాహార దీక్ష: అన్నా హజారే

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

      • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd