HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Kcrs Meeting With Kejriwal Akhilesh Keeps Cong In Dilemma

Congress in Dilemma: కేసీఆర్ పాలిట్రిక్స్ తో కాంగ్రెస్ డైలమా!

తెలంగాణ సీఎం కేసీఆర్ నిర్ణయాలతో కాంగ్రెస్ డైలమాలో పడింది.

  • Author : Balu J Date : 23-05-2022 - 4:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఇతర ప్రతిపక్ష నేతలతో చర్చలు జరిపి, కొత్త ప్రతిపక్ష ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ డైలమాలో పడినట్టు కనిపిస్తోంది. కాంగ్రెస్ ఇంకా రాష్ట్రపతి పదవికి సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించలేదు. యూపీఏ కూడా రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. వీటన్నింటి మధ్య తెలంగాణ ముఖ్యమంత్రి కాంగ్రెసేతర ఉమ్మడి ప్రతిపక్ష కూటమికి రంగం సిద్ధం చేస్తున్నారు.  ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. రాజకీయ నాయకులతో రాజకీయాలే చర్చిస్తామని ఆయన వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.

యూపీఏయేతర పార్టీలతో సహా భావసారూప్యత కలిగిన పార్టీలతో సోనియా గాంధీ సంప్రదింపులు ప్రారంభిస్తారని, అయితే ముందుగా యూపీఏ మిత్రపక్షాల అభిప్రాయాలను తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అగ్రనేతలు వెల్లడిస్తున్నారు. ఇటీవల ముగిసిన ‘చింతన్ శివిర్’లో రాష్ట్రపతి ఎన్నికలపై తీవ్రమైన చర్చ జరగలేదు. ఎందుకంటే పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాత్రమే దృష్టి పెట్టింది. ఇంకా ఎన్‌డిఎ అభ్యర్థిని ఓడించడానికి సొంత బలం లేదనే వాస్తవం కాంగ్రెస్‌కు తెలుసు. అయితే అధికార కూటమికి సాధారణ మెజారిటీ పొందడానికి ఓట్లు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీయేతర, యూపీయేతర ఓట్లకు ప్రాధాన్యం ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రతిపక్షాల బలాన్ని పరీక్షించే అవకాశం ఉన్న ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి వైపు చూడవచ్చునని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయం తీసుకోవడానికి సోనియా గాంధీ యూపీఏ భాగస్వాములందరినీ పిలిచే అవకాశం ఉంది. కానీ యూపీఏ ఖచ్చితంగా అభ్యర్థిని నిలబెడుతుంది” అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఒకరు చెప్పారు.

విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఒక అభ్యర్థిని నిలబెడితే ఉమ్మడి ప్రతిపక్షం అభ్యర్థికి మద్దతివ్వవచ్చని కాంగ్రెస్ లో మరో వర్గం పేర్కొంటుంది. అయితే పార్లమెంట్‌లో ఎక్కువ ఎంపీలున్న బీజేడీ, వైఎస్సార్‌సీపీ సహా పలు ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి ప్రతిపక్షం అభ్యర్థిని నిలబెట్టడం సాధ్యం కాదనే వాదన కూడా బలంగా  వినిపిస్తోంది. పార్లమెంటులో బీజేపీకి భారీ మెజారిటీ ఉంది. అయితే రాష్ట్రపతి ఎన్నికలకు కీలకమైన పెద్ద రాష్ట్రాల పరంగా, ఉత్తరప్రదేశ్‌లో దాని బలం తగ్గింది, మరికొన్ని కీలకమైన రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్నాయి. అయితే ఆయా పార్టీల ఐక్యత అనేది ప్రశ్నార్థమే. అయితే మొత్తానికి కేసీఆర్ ఢిల్లీ రాజకీయాలతో కాంగ్రెస్ ఒక్కసారిగా డైలామాలో పడిందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • congress
  • national politics
  • sonia gandhi

Related News

Telangana Government Good N

Disabled People : దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త

దివ్యాంగుల సాధికారతలో భాగంగా ఇప్పటికే అమలు చేసిన పథకాల వివరాలను ఛైర్మన్ ఈ సందర్భంగా గుర్తుచేశారు. తొలి విడతలో భాగంగా సుమారు 4,500 ఇందిరమ్మ ఇళ్లను దివ్యాంగుల కోటాలో కేటాయించగా,

    Latest News

    • మీరు చ‌క్కెర ఎక్కువ‌గా తింటున్నారా?

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

    • లాస్ ఏంజెలెస్‌లో మహిళ అరెస్ట్.. ఇరాన్‌కు అక్రమంగా డ్రోన్ సప్లయ్.

    • కొత్త జట్టుకు యజమానిగా క్రిస్ గేల్!

    Trending News

      • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

      • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

      • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

      • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

      • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd