Rama Navami:తెలంగాణ ప్రజలకు ‘శ్రీరామనవమి’ శుభాకాంక్షలు తెలిపిన ‘కేసీఆర్’
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలనురాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు.
- Author : Hashtag U
Date : 09-04-2022 - 7:07 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలనురాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదని సీఎం కేసీఆర్ తెలిపారు. ధర్మో రక్షతి రక్షితః” సామాజిక విలువను తుచ తప్పకుండా ఆచరించి, ధర్మాన్ని విలువలను కాపాడేందుకు తన జీవితాన్నే త్యాగం చేసిన మహోన్నత ప్రజా పాలకుడు సీతారామ చంద్రుడు భారతీయుల ఇష్ట దైవమని సీఎం కేసిఆర్ కీర్తించారు.
లోక కళ్యాణం కోసం ఎన్నో త్యాగాలకోర్చిన సీతారాముల పవిత్ర భార్యా భర్తలబంధం అజరామరమైనదని, భవిషత్ తరాలకు ఆదర్శనీయమైనదని సీఎం పేర్కొన్నారు. భద్రాచల సీతారాముల వారి ఆశీస్సులు సదా రాష్ట్ర ప్రజలకు ఉండాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించేలా దీవించాలని శ్రీ సీతారాములను సీఎం కేసీఆర్ ప్రార్ధించారు.