Election 2024 : రాజకీయవర్గాల్లో రచ్చ లేపుతున్న కేసీఆర్ వ్యాఖ్యలు..!
- By HashtagU Desk Published Date - 12:46 PM, Wed - 2 February 22

ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా వ్యాఖ్యలు చేసిన కేసీఆర్, ఈసారి ముందస్తు ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేదని, రియల్ టైమ్‌లోనే ఎన్నికలు జరుగుతాయని కేసీఆర్ తేల్చి చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్ఎస్ మరోసారి విజయభేరి మోగించడం ఖాయమని, ఈసారి గులాబీ పార్టీ 95 నుండి 105 అసెంబ్లీ స్థానాలు సొంతం చేసుకుంటుందని కేసీఆర్ జ్యోస్యం చెప్పారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు పోటీ ఇచ్చే పార్టీలు లేవని, దేశంలో ఎక్కడా అమలు జరగని పథకాలు తెలంగాణలో ప్రవేశపెట్టామని కేసీఆర్ తెలిపారు. ఇక తాను వచ్చేఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానా లేక ఎంపీగా పోటీ చేస్తానా అనేది చెప్పడానికి చాలా సమయం ఉందని, అలాగే వచ్చే ఎన్నికలకు ఆరు నెలల ముందే అభ్యర్ధులను ప్రకటిస్తామని కేసీఆర్ తెలిపారు. ఇక బీజేపీ, కాంగ్రెస్‌లు తమకు పోటీయే కాదని కేసీఆర్ చెప్పడం విశేషం. మరి కేసీఆర్ వ్యాఖ్యల పై బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎలా స్పందిస్తాయో చూడాలి.