MLC Kavitha: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం
- By Balu J Published Date - 01:51 PM, Wed - 19 January 22

గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట కవిత ఏకగ్రీవంగా ఎంపికైన విషయం విషయం తెలిసిందే. ఎలాంటి పోటీ లేకుండా నేరుగా ఆమె ఎమ్మెల్సీగా సెలక్ట్ అయ్యారు. ఈ మేరకు బుధవారం కల్వకుంట కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ‘‘ఈరోజు నేను కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాను. అందరికీ ధన్యావాదాలు. సీఎం శ్రీ కేసీఆర్ గారూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా.. అభ్యర్థిత్వంపై విశ్వాసం ఉంచినందుకు స్థానిక సంస్థల ప్రతినిధులకు హృదయపూర్వక కృతజ్ఞతలు’’ అంటూ స్పందించారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల రాజకీయ నాయకులు హాజరై కవితకు శుభాకాంక్షలు తెలిపారు.
Today I took oath as MLC for Kamareddy & Nizamabad District. I thank @trspartyonline & CM Sri KCR garu for this opportunity. My sincere gratitude to local body representatives for reposing their faith in me and my candidature by electing me unopposed. pic.twitter.com/nEYGFoZeeu
— Kavitha Kalvakuntla (@RaoKavitha) January 19, 2022