Kashmiri Pandit: లోయలో విరుచుకుపడుతున్న ఉగ్రవాదులు.. కశ్మీరీ పండిట్ పై కాల్పులు..!
- Author : HashtagU Desk
Date : 05-04-2022 - 3:10 IST
Published By : Hashtagu Telugu Desk
షోపియాన్ జిల్లాలో సోమవారం ఒక కాశ్మీర్ పండిట్‌పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మళ్ళీ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో 24 గంటల వ్యవధిలో వరుసగా 4 చోట్ల దాడులకు పాల్పడ్డారు. తాజా ఘటనలో ఉగ్రవాదులు ఓ కశ్మీరీ పండిట్ పై కాల్పులు జరపగా, అతని చేయి, కాలిలోకి బుల్లెట్లు దూసుకెళ్లాయి. దీంతో గాయపడిన బాలకిషన్‌ను శ్రీనగర్ లోని ఆర్మీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇక అంతకుముందు సీఆర్పీఎఫ్ జవాన్లు, స్థానికేతర కూలీలు, సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారు. ఛోటోగామ్ ప్రాంతంలో ఒక షాపు నిర్వహించే సోను కుమార్ బల్జీపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన పండిట్‌ను శ్రీనగర్‌లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని చికిత్స అందుతుందని పోలీసులు తెలిపారు. శ్రీనగర్లోని మైసూమా ప్రాంతంలో ఆర్పీఎఫ్ సిబ్బందిపై ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఒకరు చనిపోగా మరొకరు గాయపడ్డారు. ఆ తర్వాత మరో ఇద్దరిపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, కశ్మీరీ పండిట్ పై కాల్పులు జరిపడం సంచలనంగా మారింది.