Karne Prabhakar : టీఆర్ఎస్ కు మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ గుడ్ బై..?
TRS పార్టీకి మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
- By hashtagu Published Date - 12:38 PM, Sat - 15 October 22

టీఆర్ఎస్ లో మునుగోడు టెన్షన్ మొదలైంది. కారు పార్టీ గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్న తరుణంలో బీసీ నేతలు ఒక్కొక్కరుగా షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ గుడ్ బై చెప్పారు. శనివారం తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపించారు. ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందంటున్నారు ఆయన సన్నిహితులు.
ఇవాళ మాజీ ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ మరోసారి టీఆర్ఎస్ కు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ కు రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. కర్నే ప్రభాకర్ కూడా బీజేపీలో చేరుతారన్న వార్తలు వినిపిస్తున్నాయి.