Jubilee Hills Gang Rape:మెడపై టాటూలా ఉండాలనే కొరికాము…వెలుగులోకి సంచలన విషయాలు..!!
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది. బాలిక శరీరంపై మొత్తం 12గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది.
- By hashtagu Published Date - 03:26 PM, Sun - 12 June 22
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో బాధితురాలి మెడికల్ రిపోర్టు కీలకంగా మారింది. బాలిక శరీరంపై మొత్తం 12గాయాలు ఉన్నట్లు వైద్యులు ఇచ్చిన రిపోర్టులో ఉంది. బాలిక మెడపై నిందితులు కొరికిన గుర్తులు స్పష్టంగా ఉన్నాయి. బాలిక మెడపై తీవ్రంగా కొరకడంతో గాయాలయ్యాయి. మెడపై టాటూలా ఉండాలనే…మెడపై కొరికినట్లు నిందితులు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.
ఇవాళ ఆరుగురు నిందితులను జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ లో ఏసీపీ సుదర్శన్ విచారిస్తున్నారు. సీన్ రీ కనస్ట్రక్షన్ కోసం నిందితులను ఆమ్నేశియా పబ్ నుంచి రోడ్డు నెంబర్ 36కు తీసుకెళ్లారు. ఈ కేసులో మరో సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ఫుటేజీలో రెడ్ కలర్ బెంజ్ కారులో మైనర్ బాలిక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 నుంచి ప్రయాణిస్తున్న ఆధారాలు లభ్యమయ్యాయి.
కాగా శనివారం ముగ్గురు మైనర్లతోపాటు ఓ మేజర్ ను పోలీసులు గంటపాటు ఇంటరాగేట్ చేశారు. పబ్ లో బాలికను పరిచయం చేసుకున్నప్పటి నుంచి ట్రాప్ లోకి దించడం వరకు…ఏం జరిగింది..ఎక్కడికి పారిపోయారు…ఎవరి సహాయంతో తెలంగాణ రాష్ట్రం దాటి వెళ్లారు..అనే కోణాల్లో విచారించారు. సాదుద్దీన్ మాలిక్ కస్టడీ విచారణ ఆదివారంతో ముగియనుంది. పోలీసులు నిన్న ఆరుగురు నిందితులకు ఉస్మానియా ఆసుపత్రిలో పొటెన్సీ పరీక్షలు నిర్వహించారు
Related News
Home Voting : తెలంగాణలో ప్రారంభమైన హోం ఓటింగ్ ప్రక్రియ
Home Voting Process: తెలంగాణ(Telangana)లో ఈనెల 13న లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)కు ఓటింగ్ జరునున్న విషయం తెలిసిందే. ఈసందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission) ఇటీవల ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియ(Home Voting Process) తెలంగాణలో ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే సీనియర్ సిటిజన్లు(Senior citizens), వికలాంగులు(handicaps) (పీడబ్ల్యూడీలు) తదితరుల ఇంటింటికి ఓటింగ్ శుక్రవారం నుంచి హైదరాబాద్లో ప్రారంభమైంది. బషీర్బాగ్లోని ఆల�