Jr NTR: ఎన్టీఆర్ ఘాట్‌లో తారకరాముడికి నివాళ్లు అర్పించిన జూనియర్
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన తన తాత, టీడీపీ వ్యవస్థాపకుడు,సినీదిగ్గజం ఎన్టీ రామారావుకు నివాళ్లు అర్పించారు.
- Author : Hashtag U
Date : 28-05-2022 - 1:16 IST
Published By : Hashtagu Telugu Desk
హైదరాబాద్: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్‌ను సందర్శించిన ఆయన తన తాత, టీడీపీ వ్యవస్థాపకుడు,సినీదిగ్గజం ఎన్టీ రామారావుకు నివాళ్లు అర్పించారు.
అభిమానులను ఆయను చూసేందుకు భారీగా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆయన ఉదయాన్నే ఘాట్‌కి వచ్చి నివాళ్లు అర్పించారు. అయితే అప్పటికే ఎన్టీఆర్‌ని చూసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివతో ‘ఎన్టీఆర్ 30’ని ప్రారంభించనున్నారు. ప్రశాంత్ నీల్‌తో కలిసి ‘ఎన్టీఆర్ 31’ చిత్రాన్ని కూడా ప్రకటించాడు.