US kills Al Qaeda leader: అమెరికా డ్రోన్ దాడి.. ఆల్ ఖైదా ముఖ్య నాయకుడు హతం
అల్ ఖైదా నాయకుడు అమాన్ అల్-జవహిరిని డ్రోన్ దాడిలో యునైటెడ్ స్టేట్స్ హతమార్చిందని అధ్యక్షుడు జో బిడెన్
- By Balu J Updated On - 10:24 AM, Mon - 8 August 22

అల్ ఖైదా నాయకుడు అమాన్ అల్-జవహిరిని డ్రోన్ దాడిలో యునైటెడ్ స్టేట్స్ హతమార్చిందని అధ్యక్షుడు జో బిడెన్ సోమవారం వైట్ హౌస్ నుండి ప్రసంగంలో తెలిపారు. ఒసామా బిన్ లాడెన్‌ను US హతమార్చిన 11 సంవత్సరాల తర్వాత, జవహిరి కేవలం 71 సంవత్సరాల వయస్సున్న ఆయన్ను హతమర్చారు. ఒకానొక సమయంలో బిన్ లాడెన్ వ్యక్తిగత వైద్యునిగా వ్యవహరించాడు. సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి రెండు హెల్‌ఫైర్ క్షిపణులను ఉపయోగించి చంపినట్టు పేర్కొన్నాడు. రాత్రి 9:48 గంటలకు డ్రోన్ స్ట్రైక్ నిర్వహించారు. బిడెన్ తన క్యాబినెట్, ముఖ్య సలహాదారులతో వారాల సమావేశాల తరువాత శనివారం ETకి అధికారం ఇచ్చి, పకడ్బందీ సమాచారంతో అల్ ఖైదా నాయకుడు ను హతమర్చారు. అయితే అమెరికా డ్రోన్ దాడి చేసినప్పుడు ఆయన ఆ ఇంటి బాల్కనీలో తిరుగుతున్నారని అధికారులు తెలిపారు.మిగతా కుటుంబ సభ్యులు కూడా అక్కడే ఉన్నారు కానీ, వారికి ఏమీ కాలేదని, అల్ జవహిరిని మాత్రమే లక్ష్యంగా చేసుకొని చంపినట్టు వెల్లడించారు.
లాడెన్ మరణం తరువాత అల్ జవహిరి అల్ ఖైదాకు నాయకత్వం వహించారు.కానీ,ఆయన ఉనికి నామమాత్రంగానే మిగిలిపోయింది. ఎప్పుడైనా ఏదైనా సందేశాలు ఇవ్వడానికే పబ్లిక్‌లో కనిపిస్తుండేవారు.అల్ జవహిరి మరణానికి అమెరికా వేడుక చేసుకుంటుంది. ముఖ్యంగా గత ఏడాది అఫ్గానిస్తాన్ నుంచి తమ దళాలను వెనక్కు రప్పించిన నేపథ్యంలో ఇది వారికి పెద్ద విజయం. అయితే, ఇస్లామిక్ స్టేట్ వంటి పలు ఇతర సంస్థలు వెలుగులోకి వచ్చి, చురుకుగా మారడంతో అల్ జవహిరి ప్రభావం పెద్దగా కనిపించలేదు.ఇప్పుడు ఆయన మరణం తరువాత కొత్త అల్ ఖైదా నాయకుడు తెరపైకి వస్తాడు. కానీ, ఆయన ప్రభావం కూడా తక్కువగానే ఉండవచ్చు. కాబూల్‌లో జరిపిన తాజా దాడి అఫ్గానిస్తాన్ పట్ల ఇంకా ఆందోళనలు ఉన్నాయని నిరూపిస్తుంది. ముఖ్యంగా అక్కడ తాలిబాన్ పాలనలోకి రావడం, మళ్లీ ఆ దేశం తీవ్రవాద మూకలకు స్వర్గంలా మారుతుందనే ఆందోళనలు వినిపిస్తున్నాయి.అయితే, సుదూరాల నుంచి కూడా ఉగ్రవాదంపై విల్లు ఎక్కుపెట్టగలమని తాజా దాడితో అమెరికా నిరూపించింది.
Related News

Salman Rushdie : ప్రముఖ రచయితపై న్యూయార్క్ లో దాడి…!!
ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీపై న్యూయార్క్ లో దాడి జరిగింది. ముస్లిం ఛాందసవాదుల నుంచి ఆయన బెదిరింపులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ దాడి జరిగింది.