ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత కన్నుమూత!
ఆయన సాహిత్య కృషికి గాను ఇటీవల 59వ జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. నవంబర్ 21న రాయ్‌పూర్‌లోని ఆయన నివాసంలోనే ఈ అవార్డును ప్రదానం చేశారు.
- Author : Gopichand
Date : 23-12-2025 - 7:56 IST
Published By : Hashtagu Telugu Desk
Vinod Kumar Shukla: ప్రముఖ హిందీ సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా (89) మంగళవారం (డిసెంబర్ 23, 2025) కన్నుమూశారు. రాయ్‌పూర్ ఎయిమ్స్ (AIIMS)లో చికిత్స పొందుతూ సాయంత్రం 4:58 గంటలకు ఆయన చివరి శ్వాస విడిచినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
వినోద్ కుమార్ శుక్లా కన్నుమూత
రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస వినోద్ కుమార్ శుక్లా కుమారుడు శాశ్వత్ శుక్లా తెలిపిన వివరాల ప్రకారం.. శ్వాసకోశ సమస్యల కారణంగా ఈ నెల 2వ తేదీన ఆయనను రాయ్‌పూర్ ఎయిమ్స్‌లో చేర్పించారు. అంతకుముందు అక్టోబర్‌లో కూడా అనారోగ్యంతో ప్రైవేట్ ఆసుపత్రిలో చేరి, కోలుకుని ఇంటికి వచ్చారు. అయితే డిసెంబర్ 2న ఆరోగ్యం మళ్లీ క్షీణించడంతో ఎయిమ్స్‌కు తరలించారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Also Read: ఆపదలో ఉన్నవారి లొకేషన్ కనిపెట్టే గూగుల్ ఫీచర్!
సాహిత్య రంగంలో ధ్రువతార వినోద్ కుమార్ శుక్లా హిందీ సాహిత్యంలో తనదైన ముద్ర వేశారు. ఆయన రాసిన ప్రముఖ రచనల్లో కొన్ని
- ‘నౌకర్ కీ కమీజ్’ (నవల)
- ‘ఖిలేగా తో దేఖేంగే’
- ‘ఏక్ చుప్పీ జగహ్’
ఆయన సాహిత్య కృషికి గాను ఇటీవల 59వ జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది. నవంబర్ 21న రాయ్‌పూర్‌లోని ఆయన నివాసంలోనే ఈ అవార్డును ప్రదానం చేశారు.
ప్రధాని మోదీ సంతాపం
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత, ప్రఖ్యాత రచయిత వినోద్ కుమార్ శుక్లా గారి మరణం అత్యంత బాధాకరం. హిందీ సాహిత్యానికి ఆయన చేసిన అమూల్యమైన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి. అని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. గత నెల నవంబర్ 1న ప్రధాని మోదీ స్వయంగా ఆయనతో ఫోన్‌లో మాట్లాడి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.