Jharkhand Political Crisis : జార్ఖండ్‌లో క్యాంప్ రాజకీయం… రెండు బస్సుల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేల తరలింపు
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అనర్హత వేటు
- By Prasad Published Date - 10:18 AM, Sun - 28 August 22
ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణలపై జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్యేగా అనర్హత వేటు పడుతుందనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ ఊహాగానాల మధ్య శాసనసభ్యులను సమావేశానికి పిలిచిన ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీ నివాసం నుంచి శనివారం మధ్యాహ్నం జార్ఖండ్ ఎమ్మెల్యేలను ఎక్కించుకుని బస్సులు బయలుదేరాయి. JMM నేతృత్వంలోని అధికార కూటమికి చెందిన ఎమ్మెల్యేలతో రెండు వోల్వో బస్సులు ఈ రోజు జార్ఖండ్ ముఖ్యమంత్రి నివాసం నుండి బయలుదేరాయి. కాగా జార్ఖండ్ కాంగ్రెస్ శాసనసభా పక్షం ఇంఛార్జ్ అవినాష్ పాండే అధ్యక్షతన ఈరోజు సాయంత్రం సమావేశం కానుంది. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో, అధికార కూటమిలో జేఎంఎంకు 30 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌కు 18 మంది ఎమ్మెల్యేలు, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ)కి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు.