HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >Jeevan Reddy Said Brs Government Did Nothing But Propaganda

Jeevan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదు

  • Author : Balu J Date : 12-01-2024 - 7:47 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
MLC Elections
MLC Elections

Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తరచుగా మీడియా ముందుకొచ్చి నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌కు ఇంకా జ్ఞానోదయం కలగలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం అని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆత్మస్తుతి, పరనింద నుంచి బయటకు రావాలని లేకపోతే పార్లమెంట్ ఎన్నికలలో ఓటమి ఖాయమని విమర్శించారు.

బిఆర్ఎస్ మిత్రపక్షంగా భావించే రాజకీయ పార్టీ పక్కలో బల్లెంలా వేచిచూస్తోందని చురకలంటించారు. ఇప్పటికైనా తెలుసుకొని వాస్తవాలకు అనుగుణంగా వ్యవహరించి ప్రతిపక్ష స్థానంలో నిలబెట్టుకోవాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికలలో తప్పుడు ప్రచారంతోనే బిఆర్ఎస్ కు ఓట్లు పడ్డాయన్నారు.ఓటమిని అంగీకరించే పరిస్థితిలో కేటీఆర్ లేడని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. మిషన్ భగీరథ పెద్ద స్కాం అని ఆరోపించారు. కాళేశ్వరం రీ డిజైన్ పెద్ద బోగస్ అని.. కేవలం కమీషన్ ల కోసం రీ డిజైన్ చేశార‌ని మండిప‌డ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ సబ్ ప్లాన్ ను ఎస్సీ డెవల్మెంట్ ఫండ్ గా మార్చి నిధులను మళ్ళించిందని.. నిధుల దారి మళ్ళింపును చర్చకు రాకుండా చేసేందుకు దళిత బంధును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

ఎస్సీ, బీసీ, మైనారిటీ బంధుల పేరుతో ఎన్నికల ముందు హాడావిడి చేశార‌ని అన్నారు. బీఆర్ఎస్ పరోక్ష మిత్ర పక్షంగా భావిస్తున్న బీజేపీ పక్కలో బల్లంలా కాచుకుని ఉందని విమ‌ర్శించారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు డిపాజిట్లు రావని జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థులను మార్చడం కాదు.. నాయకుడిని మార్చాల్చి ఉందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • hard comments
  • jeevan reddy
  • ktr

Related News

Brs Leader Balka Suman

బెయిల్‌పై విడుదలైన బాల్క సుమన్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ఆదిలాబాద్ జైలులో రిమాండ్‌లో ఉన్న ఆయన, ఇవాళ‌ బెయిల్‌పై విడుదలయ్యారు. ఆయనతో పాటు ఇదే కేసులో అరెస్టయిన ఇతర బీఆర్ఎస్ నాయకులు కూడా జైలు నుంచి బయటకు వచ్చారు. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల నాటి ఘటనలకు సంబంధించి బాల్క సుమన్‌పై రెండ

    Latest News

    • Mega Family : పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన మెగా కోడలు

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • Bigg Boss Demon Pavan: డెమాన్ పవన్ ఇంట విషాదం..శోకసంద్రంలో రీతూ

    • Ponguleti Srinivas Reddy : కేసీఆర్‌కు మంత్రి పొంగులేటి బహిరంగ సవాల్

    • Crude Oil: ట్రంప్ ఒక్క మాట తో దిగొచ్చిన చమురు ధరలు

    Trending News

      • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd