Jasprit Bumrah: ఐసీసీ ర్యాంకింగ్స్ లో సత్తాచాటిన జస్పీత్ బుమ్రా.. నంబర్ వన్ స్థానం కైవసం..!
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో పెద్ద మార్పు కనిపించింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్టుల్లో కొత్త నంబర్-1 బౌలర్‌గా నిలిచాడు.
- Author : Gopichand
Date : 07-02-2024 - 2:21 IST
Published By : Hashtagu Telugu Desk
Jasprit Bumrah: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా టెస్టు ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఈ ర్యాంకింగ్‌లో పెద్ద మార్పు కనిపించింది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) టెస్టుల్లో కొత్త నంబర్-1 బౌలర్‌గా నిలిచాడు. విశేషమేమిటంటే.. అతను టీమిండియా ఆటగాడు ఆర్ అశ్విన్ నుండి నంబర్-1 కిరీటం కొల్లగొట్టాడు. ఇటీవలే ఇంగ్లండ్‌పై జస్ప్రీత్ బుమ్రా అద్భుత ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే.
టెస్టుల్లో బుమ్రా నంబర్ 1 బౌలర్
జస్ప్రీత్ బుమ్రా 881 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానానికి చేరుకున్నాడు. అదే సమయంలో ఆర్ అశ్విన్ మొదటి నుంచి మూడో స్థానానికి చేరుకున్నాడు. అతని రేటింగ్ పాయింట్లు 841. కాగా.. కగిసో రబడా రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ నాలుగో స్థానంలో నిలిచాడు. అతని రేటింగ్ పాయింట్లు 828. గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడని రవీంద్ర జడేజా ఈ ర్యాంకింగ్‌లో 8వ స్థానానికి వచ్చాడు.
Also Read: India Tour Of Zimbabwe: జింబాబ్వేలో పర్యటించనున్న టీమిండియా.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా నిలిచాడు
జస్ప్రీత్ బుమ్రా టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్‌గా నిలవడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు వన్డే, టీ20ల్లో ఈ ఘనత సాధించాడు. దీంతో క్రికెట్ చరిత్రలో తన పేరు మీద ఓ రికార్డు కూడా నమోదు చేసుకున్నాడు. తన కెరీర్‌లో మూడు ఫార్మాట్లలో నంబర్-1గా నిలిచిన ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ప్రపంచంలో ఏ బౌలర్ ఈ ఘనత సాధించలేకపోయాడు. మరోవైపు జస్ప్రీత్ బుమ్రా తన పేరును మరొక జాబితాలో చేర్చారు. విరాట్ కోహ్లీ తర్వాత ఆసియా నుంచి మూడు ఫార్మాట్లలో నంబర్-1గా నిలిచిన రెండో ఆటగాడిగా కూడా నిలిచాడు.
We’re now on WhatsApp : Click to Join