Jagan-Modi: ‘మోదీ’తో ముగిసిన ‘జగన్’ భేటీ..!
ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. ప్రధానితో గంటకు పైగా ముఖ్యమంత్రి భేటీ కొనసాగింది.
- By Hashtag U Published Date - 10:53 PM, Tue - 5 April 22

ప్రధాని నరేంద్రమోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ ముగిసింది. ప్రధానితో గంటకు పైగా ముఖ్యమంత్రి భేటీ కొనసాగింది. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రధాని మోదీకి సీఎం జగన్ వివరించినట్లు సమాచారం.
పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, రెవెన్యూ లోటు, విభజన నేపథ్యంలో… ఏపీకి రావాల్సిన నిధుల విడుదల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు జగన్. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలు ఏవైతే ఉన్నాయో… వాటిపైనే ప్రధానంగా చర్చించినట్లు సమాచారం.