Ivana Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ మృతి
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) న్యూయార్క్ నగరంలోని తన నివాసంలో కన్నుమూశారు.
- By Prasad Published Date - 02:35 PM, Fri - 15 July 22
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదటి భార్య ఇవానా ట్రంప్ (73) న్యూయార్క్ నగరంలోని తన నివాసంలో కన్నుమూశారు. వ్యాపారవేత్త, మోడల్, రచయిత్రి, ఫ్యాషన్ డిజైనర్ అయిన ఇవానా గురువారం తుది శ్వాస విడిచారు. 1977లో ఇవానాని డోనాల్డ్ ట్రంప్ వివాహం చేసుకున్నారు. 15 సంవత్సరాల తర్వాత 1992లో విడాకులు తీసుకున్నారు. ఈ దంపతులకు డోనాల్డ్ జూనియర్, ఇవాంకా, ఎరిక్ ట్రంప్ అనే ముగ్గురు పిల్లలు ఉన్నారు.