I Am With CBN : చంద్రబాబుకు మద్ధతుగా బెంగుళూరులో ఐటీ ఉద్యోగుల నిరసనలు
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దుతగా బెంగుళూరులో ఐటీ ఆందోళనలు జరిగాయి.
- By Prasad Published Date - 05:49 PM, Fri - 15 September 23

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మద్దుతగా బెంగుళూరులో ఐటీ ఆందోళనలు జరిగాయి. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ బెంగళూరులో నివసిస్తున్న తెలుగు వారు. ఐటీ ఉద్యోగులు ఆందోళన చేశారు. ఐయామ్ విత్ సీబీఎన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జయనగర్‌లోని వినాయక స్వామి ఆలయంలో చంద్రబాబు కోసం ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చంద్రబాబుకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించారు. బెంగళూరులో తెలుగుదేశం ఫోరం, తెలుగు సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరిగాయి. చంద్రబాబును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినప్పుడు కూడా ఐటీ నిపుణులు ఫ్రీడం పార్క్ లో నిరసన తెలిపారు. అనంతరం దీక్షలు కూడా చేపట్టారు.