ISRO PSLV C-59: నిప్పులు చిమురుతూ నింగిలోకి దూసుకెళ్లిన ఇస్రో పీఎస్‌ఎల్వీ సి-59
సూర్యుడి అన్వేషణలో పీఎస్‌ఎల్‌వీ-సీ51 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కోట్లాది భారతీయుల కలలను మోసుకుంటూ, భానుడి వైపు తన ప్రయాణాన్ని ప్రారంభించింది.
- By Kode Mohan Sai Published Date - 04:47 PM, Thu - 5 December 24

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ59 వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. సాంకేతిక లోపం కారణంగా నిన్న నిర్వహించాల్సిన ప్రయోగం ఇవాళటికి వాయిదా పడింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహకనౌక నిప్పులు చిమురుతూ నింగిలోకి ప్రవేశించింది.
ఈ ప్రయోగంలో, ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్‌ఏ)కు చెందిన ప్రోబా-3తో పాటు ఇతర చిన్న ఉపగ్రహాలను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్ ద్వారా ప్రయోగించింది. ప్రోబా-3లో రెండు ఉపగ్రహాలు ఉన్నాయి, వాటి బరువు 550 కిలోలు. ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సూర్యుడి బాహ్య వాతావరణం అయిన కరోనాపై పరిశోధనలు చేయడమే. ఈ పరిశోధన కోసం, ఉపగ్రహాలు పరస్పరం సమన్వయంతో ఒక క్రమంలో భూకక్ష్యలో ప్రయాణిస్తాయి. ఈ తరహా ప్రయోగాన్ని చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారిగా జరిగిందని ఈఎస్‌ఏ ప్రకటించింది.
🌟 Liftoff Achieved!
PSLV-C59 has successfully soared into the skies, marking the commencement of a global mission led by NSIL, with ISRO’s technical expertise, to deploy ESA’s groundbreaking PROBA-3 satellites.
🌍 A proud moment celebrating the synergy of international…
— ISRO (@isro) December 5, 2024