ISRO-Singapore Satellites : 7 సింగపూర్ శాటిలైట్స్ తో నింగిలోకి ఇస్రో రాకెట్
ISRO-Singapore Satellites : బిజినెస్ లోనూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దూసుకుపోతోంది. ఇతర దేశాల ఉపగ్రహాలను లాంచ్ చేసే విభాగంలో రాకెట్ స్పీడ్ తో ముందుకు సాగుతోంది.
- By Pasha Published Date - 08:53 AM, Sun - 30 July 23

ISRO-Singapore Satellites : బిజినెస్ లోనూ భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దూసుకుపోతోంది.
ఇతర దేశాల ఉపగ్రహాలను లాంచ్ చేసే విభాగంలో రాకెట్ స్పీడ్ తో ముందుకు సాగుతోంది.
తాజాగా ఆదివారం ఉదయం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌లో ఉన్న మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి సింగపూర్ కు చెందిన 7 ఉపగ్రహాలను ఇస్రో తన PSLV-C56 రాకెట్ ద్వారా సక్సెస్ ఫుల్ గా ప్రయోగించింది.
వీటిలో ఇజ్రాయెల్ టెక్నాలజీతో సింగపూర్ డెవలప్ చేసిన “డీఎస్-ఎస్ఏఆర్” (DS-SAR) శాటిలైట్ అతి ముఖ్యమైంది.
దీనితో పాటు సింగపూర్ కు చెందిన ఇంకొందరు క్లయింట్లు అందజేసిన 6 శాటిలైట్లను కూడా ఇస్రో నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.
Also read : Stuart Broad: క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్న స్టువర్ట్ బ్రాడ్.. ఎప్పుడంటే..?
సింగపూర్ శాటిలైట్ “డీఎస్-ఎస్ఏఆర్” (DS-SAR) విషయానికొస్తే .. దాని బరువు 360 కిలోలు. ఇందులో ఇజ్రాయెల్ ఏరోస్పేస్ ఇండస్ట్రీస్ అభివృద్ధి చేసిన సింథటిక్ ఎపర్చర్ రాడార్ (SAR) ఉంది. సింగపూర్ ప్రభుత్వ సంస్థల రోజువారీ కార్యకలాపాలకు అవసరమైన శాటిలైట్ ఇమేజెస్ ను సేకరించేందుకు DS-SAR శాటిలైట్ దోహదం చేయనుంది. ఇక శాటిలైట్ నుంచి వచ్చే సమాచారాన్ని సింగపూర్ కు చెందిన ఎస్టీ ఇంజినీరింగ్ కంపెనీ(ISRO-Singapore Satellites) తమ వినియోగదారుల కోసం వాడుకుంటుంది. పగలు, రాత్రి వాతావరణ అంచనాలను కూడా ఈ శాటిలైట్ తెలియజేస్తుంది. మిగితా 6 కమర్షియల్ శాటిలైట్లలో 3 శాటిలైట్లు 10 కిలోల కంటే తక్కువ బరువున్నవి. వీటిని నానో శాటిలైట్స్ అని పిలుస్తారు.