iSmart Shankar: ఇస్మార్ట్ శంకర్ రిపీట్, రామ్ తో పూరి!
ఇస్మార్ట్ శంకర్ మేజిక్ ను రిపీట్ చేయాలని డిసైడ్ అయ్యారు రామ్-పూరి.
- Author : Balu J
Date : 11-05-2023 - 6:06 IST
Published By : Hashtagu Telugu Desk
లైగర్ మూవీ తర్వాత డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఏ సినిమా చేస్తాడా? ఏ హీరోను డైరెక్ట్ చేయబోతున్నాడా? అనే వార్తలు విపరీతంగా వైరల్ అయ్యిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసక్తికర వార్త ఒకటి బయటకొచ్చింది. ఇస్మార్ట్ శంకర్ మేజిక్ ను రిపీట్ చేయాలని డిసైడ్ అయ్యారు రామ్-పూరి. ఇది అచ్చంగా ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ అనే టాక్ నడుస్తోంది. సినిమాకు టైటిల్ కూడా సీక్వెల్ అర్థం వచ్చేలా పెడతారంట. 15న రామ్ పుట్టినరోజు. ఆ రోజు ఈ ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు బయటకొస్తాయి.
పూరి జగన్నాధ్ తో వ్యవహారం మామూలుగా ఉండదు. ఇలా సినిమా మొదలైందనుకునేలోపే, పూర్తయిపోతుంది. అంత ఫాస్ట్ గా ఉంటుంది మేకింగ్. అందుకే పూరి కోసం తన కమిట్ మెంట్ సైతం పక్కనపెట్టాడు రామ్. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రామ్. ఈ మూవీ కంప్లీట్ అయిన వెంటనే మరో ప్రాజెక్ట్ సెట్స్ పైకి రావాల్సి ఉంది. పూరి జగన్నాధ్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే చెప్పాడట.
Also Read: Ustaad Bhagat Singh Glimpse: పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే, ఈసారి ఫర్మామెన్స్ బద్దలైపోవాల్సిందే!