IPL Fitness: బట్లర్-పడిక్కల్ ఫిట్ నెస్ కు ఫాన్స్ ఫిదా
రాజస్థాన్ రాయల్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.
- By Hashtag U Published Date - 04:39 PM, Tue - 19 April 22

రాజస్థాన్ రాయల్స్ , కోల్ కత్తా నైట్ రైడర్స్ మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. రాజస్థాన్ రాయల్ ఓపెనర్లు బట్లర్- దేవదత్ పడిక్కల్ జోడీ ఒక బంతికి ఏకంగా నాలుగు పరుగులు తీసింది. సహజంగా ఓవర్ త్రో కారణంగా ఇలాంటి పరుగులు వస్తాయి. కానీ ఈ మ్యాచ్‌లో బట్లర్, దేవదత్ పడిక్కల్ వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తి మరీ నాలుగు పరుగులు సాధించారు. కేకేఆర్ బౌలర్ ఉమేశ్ యాదవ్ వేసిన మూడో ఓవర్ చివరి బంతిని బట్లర్ బ్యాక్‌వర్డ్ పాయింట్ దిశగా ఆడాడు. బంతి బౌండరీ లైన్‌ను చేరుతుండగా వెంకటేశ్ అయ్యర్ అద్భుతమైన డైవ్‌తో అడ్డుకున్నాడు. అంతలోపే బట్లర్ , పడిక్కల్ ద్వయం చకచకా నాలుగు పరుగులు సాధించారు. దింతో వీరిద్దరి ఫిట్ నెస్ పై అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదిలా ఉంటే ఈ మ్యాచ్ లో ఓపెనర్ గా బరిలోకి దిగిన జోస్ బట్లర్ మరోసారి విధ్వంసం సృష్టించాడు. 59 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. మొత్తం 61 బంతులు ఆడిన బట్లర్ 103 పరుగులు చేసి కమిన్స్ బౌలింగ్‌లో ఔటయ్యడు. దీంతో రాజస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 217 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్ లో కోల్ కతా నైట్ రైడర్స్ పై 7 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ అద్భుత విజయాన్ని అందుకుంది.ఫించ్ , శ్రేయాస్ అయ్యర్ జోరుతో కోల్ కత్తా ఒక దశలో మ్యాచ్ గెలిచెలా కనిపించింది. అయితే చివర్లో ఛాహల్ హ్యాట్రిక్ తో రాజస్థాన్ కు విజయాన్ని అందించాడు.
https://twitter.com/Raj93465898/status/1516059598285062144