International Literacy Day : అమ్మ ప్రేమను పంచుతుంది..అక్షరం జ్ఞానాన్ని పెంచుతుంది
ప్రజలు అక్షరాస్యత గురించి మరియు సమాజాన్ని మెరుగ్గా నిర్మించడంలో దాని ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిపించడమే అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం
- By Sudheer Published Date - 01:01 PM, Fri - 8 September 23

International Literacy Day 2023 : ఒక వ్యక్తి జీవితంలో అక్షరాస్యత యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని (International Literacy Day) జరుపుకుంటారు. ప్రజలు అక్షరాస్యత గురించి మరియు సమాజాన్ని మెరుగ్గా నిర్మించడంలో దాని ప్రభావం గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కలిపించడమే అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశ్యం.
Read Also : Why Pawan Kalyan Silent : పవన్ సైలెంట్ అయిపోయాడేంటి..?
‘అక్షరాస్యుడు’ అనే పదానికి అర్థం చదవడం మరియు వ్రాయగల సామర్థ్యం. అందువల్ల, అక్షరాస్యత (Literacy) అనేది విద్యకు ముందున్న మార్గం అలాగే అక్షరాస్యత విద్యావంతులైన సమాజాన్ని కలిగి ఉండాలనే లక్ష్యాన్ని సాధించడానికి మొదటి మెట్టు. చదవటం, రాయటం, వినటం, మాట్లాడటం అనే నాలుగు ప్రాథమికాంశాలు తెలుసుకోవటాన్నే అక్షరాస్యత అనవచ్చు. అయితే.. రాయడం, చదవటం మాత్రమే అక్షరాస్యత కాదనీ.. గౌరవం, అవకాశాలు, అభివృద్ధి గురించి చెప్పడమే నిజమైన అక్షరాస్యత అని చాలామంది చెపుతుంటారు.
ప్రపంచం (World) అన్నిరంగాల్లో ముందుకు సాగేందుకు విద్య, విజ్ఞానం ఎంతో అవసరం. ఉన్నతమైన జీవనానికి కూడా ఇవే అంతే ముఖ్యం. 1965 , నవంబర్ 17 న యునెస్కో సభ్యదేశాల విద్యాశాఖా మంత్రుల మహాసభ అనంతరం.. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం (International Literacy Day) ప్రకటించబడింది. ఆ తరువాత 1966వ సంవత్సరం నుండి ప్రతి యేడాదీ క్రమం తప్పకుండా అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవాన్ని జరుపుకుంటూ వస్తున్నాం. ప్రతి ఐదుమంది పెద్దలలో ఒకరికి, ప్రతి ముగ్గురు మహిళలలో ఇద్దరికి ఈ రోజుకు కూడా అక్షరజ్ఞానం లేదు. ప్రపంచంలోని కొన్ని దేశాలు అన్ని రకాలుగా వెనుబడి ఉండటానికి నిరక్షరాస్యత ముఖ్య కారణంగా చెప్పవచ్చు. అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే… అక్షరాస్యతను వ్యక్తులు మరియు సంఘాలకు అందించటం. ఇది పిల్లల్లో విద్యపైనేగాకుండా, వయోజన విద్యమీద కేంద్రీకరించబడుతుంది.
Read Also : Mouni Roy : నల్లచీరలో నాగిని ఫేమ్ మౌని రాయ్ అందాల విందు
ప్రపంచవ్యాప్తంగా 770 మిలియన్ల మంది నిరక్షరాస్యులుగా పరిగణించబడుతున్నారని యునెస్కో అంచనా వేసింది. UNESCO (2006) విద్యా గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ ప్రకారం.. దక్షిణ, పశ్చిమ ఆసియా తక్కువ ప్రాంతీయ వయోజన అక్షరాస్యత (58.6%) రేటు ఉంది. తరువాత సబ్ సహారన్ ఆఫ్రికా (59.7%), అరబ్ స్టేట్స్ (62.7%) వంటివి ఉన్నాయి. ప్రపంచంలో అతి తక్కువ అక్షరాస్యత రేట్లు దేశాలు బుర్కినా ఫాసో (12.8%), నైగర్ (14.4%), మాలి (19%) లు గా ఉన్నాయి.
అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం వేడుకలను వివిధ దేశాలలో ప్రత్యేక నేపథ్యాలుగా అందరికీ విద్య అనే నినాదంగా లక్ష్యాలను చేరే కృషి చేస్తున్నాయి. ఇతర యునైటెడ్ నేషన్స్ కార్యక్రమాలు యునైటెడ్ నేషన్స్ అక్షరాస్యత డికేడ్ నిర్వహించడం జరుగుతున్నాయి. అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం 2008 HIV, క్షయ, మలేరియాతో, ప్రపంచంలో ముందంజలో ప్రజా ఆరోగ్య సమస్యలు, కొన్ని అంటువ్యాధులు దృష్టితో నిర్వహింపబడుతుంది.
యునెస్కో 1990 సంవత్సరాన్ని అక్షరాస్యతా సంవత్సరంగా ప్రకటించింది. ఐక్య రాజ్య సమితి 2003 – 2012 దశాబ్దాన్ని అక్షరాస్యతా దశాబ్దంగా ప్రకటించింది. “Literacy for all, Voice for all, Learning for all” అనే అంశాల్ని ఈ దశాబ్ది లక్ష్యంగా నిర్దేశించింది.
Read Also : Mahesh Babu: యూట్యూబ్ రికార్డులను బద్దలు కొట్టిన మహేశ్, శ్రీమంతుడు మూవీకి 200 M+ వ్యూస్
ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే అక్షరాస్యత విషయంలో భారతదేశం అగాథంలో వున్నట్లే చెప్పవచ్చు. ఈ మాత్రమైనా మనదేశ (India) అక్షరాస్యత ఉందంటే దానిక్కారణం కొన్ని రాష్ట్రాలు అక్షరాస్యతను సాధించటంలో ముందుండటం తప్ప మరోటి కాదు. బీహార్, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు సగటు అక్షరాస్యతా శాతానికి దూరంగా ఉన్న విషయం తెలిసిందే. మొత్తం మీద ప్రపంచ నిరక్షరాస్యుల్లో సగం మంది మనదేశంలోనే ఉండటం విచారకరం.