Inter Exams: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి.
- Author : Balu J
Date : 06-05-2022 - 4:51 IST
Published By : Hashtagu Telugu Desk
ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 1,443 కేంద్రాల్లో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్-1తో ప్రారంభమైన మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలు మధ్యాహ్నం 12 గంటలకు ముగిశాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,64,626 మంది విద్యార్థులు హాజరయ్యారు. శనివారం ప్రారంభం కానున్న ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,42,767 మంది విద్యార్థులు అటెండ్ అవుతారు. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (TS BIE) పరీక్షల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేసింది. పరీక్షల నిర్వహణకు 75 ఫ్లయింగ్ స్క్వాడ్‌లతో పాటు మొత్తం 25,513 మంది ఇన్విజిలేటర్లను, పరీక్షల నిర్వహణను పర్యవేక్షించేందుకు 150 మంది సిట్టింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు.