Karnataka: టిప్పు సుల్తాన్ కు వ్యతిరేకంగా పోస్టులు.. కర్ణాటకలో ఉద్రిక్తతం
మైనారిటీలను అవమానకరంగా చిత్రీకరించే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూర్వం మైసూరు ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ మరియు ఇతర మైనారిటీ కమ్యూనిటీ రాజులను అవమానించే పోస్ట్‌లు కర్ణాటక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
- By Praveen Aluthuru Published Date - 03:26 PM, Sat - 11 November 23

Karnataka: మైనారిటీలను అవమానకరంగా చిత్రీకరించే పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కర్ణాటకలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పూర్వం మైసూరు ప్రాంతాన్ని పాలించిన టిప్పు సుల్తాన్ మరియు ఇతర మైనారిటీ కమ్యూనిటీ రాజులను అవమానించే పోస్ట్‌లు కర్ణాటక సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో కర్ణాటకలోని బెలగావి జిల్లాలోని చిక్కోడి పట్టణంలో శనివారం ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసు శాఖ భద్రతను కట్టుదిట్టం చేసింది.
ఘాతుకానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని మైనారిటీ సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ క్రమంలో కొందరు నిరసనలు తెలుపుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తతగా మారడంతో డిప్యూటీ ఎస్పీ సీబీ గౌడర్ తో పాటు 50 మందికి పైగా పోలీసులు బెలగావి జిల్లాలోని చిక్కోడి పట్టణంలో మోహరించారు.
అఖండ్ భారత్ సప్నా హై, ఆఫ్ఘనిస్తాన్ తక్ అప్నా హై అనే బ్యానర్లు పట్టణంలో వెలిశాయి. దీపావళి వేడుకల నేపథ్యంలో సున్నిత ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు . ఈ మేరకు చిక్కోడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Also Read: Chandra Mohan: చంద్ర మోహన్ స్వయంగా ఎంపిక చేసిన టాప్ 30 సాంగ్స్ ఇవే