Narayana CPI: జగన్ ను పారిశ్రామికవేత్తలు నమ్మే పరిస్థితి లేదు!
జగన్‌ను పారిశ్రామిక వేత్తలు విశ్వసించే పరిస్ధితి లేదని నారాయణ అన్నారు.
- By Balu J Updated On - 03:48 PM, Tue - 7 March 23

ఇటీవలనే ఏపీలో గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రానికి వేల కోట్లు పెట్టుబడులు వచ్చినట్టు అధికార పార్టీ నేతలు ధీమా చెబుతుంటే, మరోవైపు గ్లోబల్ సమ్మిట్ తో ఏపీకి ఒరిగిందేమీ లేదని ప్రతిపక్ష నేతలు కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ స్పందించారు.
జగన్‌ను పారిశ్రామిక వేత్తలు విశ్వసించే పరిస్ధితి లేదని అన్నారు. తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీ కోసం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు కాకి లెక్కలేనని చెప్పారు. విశాఖ పెట్టుబడుల సదస్సు అంతా నాటకమేనని ఆరోపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వారిపై దాడులు చేస్తున్నారన్నారు. లోకేశ్ పాదయాత్రను ఎందుకు అడ్డుకుంటున్నారని నారాయణ ప్రశ్నించారు. ప్రశ్నించారు.

Related News

Ramdev Baba: ఆవు మూత్రంతో క్యాన్సర్,హై బీపీ తగ్గుతాయి: రాందేవ్ వివాదస్పద వ్యాఖ్యలు
రాందేవ్ ఇటీవల తరుచుగా వివాదాల్లోకి ఎక్కుతున్నారు. తాజాగా ఆయన మళ్ళీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు