IndiGo Flight: విమానం గాల్లో ఉండగానే రక్తపు వాంతులు.. ప్రయాణికుడు మృతి
విమానం గాల్లో ఉండగా రక్తపు వాంతులు (Blood Vomits) చేసుకుని ఓ వ్యక్తి మరణించాడు. ముంబై నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight)లో ఈ ఘటన జరిగింది.
- By Gopichand Published Date - 11:38 AM, Tue - 22 August 23

IndiGo Flight: విమానం గాల్లో ఉండగా రక్తపు వాంతులు (Blood Vomits) చేసుకుని ఓ వ్యక్తి మరణించాడు. ముంబై నుంచి రాంచీ వెళ్తున్న ఇండిగో విమానం (IndiGo Flight)లో ఈ ఘటన జరిగింది. విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు విమానంలో రక్తపు వాంతులు చేసుకున్నాడు. దీంతో ప్రయాణికులందరూ భయపడ్డారు. ఇలా జరిగిన వెంటనే ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడంతో కొద్దిసేపటికే మృతి చెందాడు. ప్రయాణికుడి ఆరోగ్యం క్షీణించడంతో పైలట్ నాగ్‌పూర్ విమానాశ్రయంలో విమానాన్ని అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. అయితే విమానం ల్యాండ్ అయ్యే సమయానికి ప్రయాణికుడు మృతి చెందాడు.
విమానాశ్రయంలో వైద్య బృందం పరీక్షించింది
ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్‌కు ముందే నాగ్‌పూర్ విమానాశ్రయంలో కిమ్స్-కింగ్స్‌వే ఆసుపత్రి వైద్య బృందం ఉంది. వారు వెంటనే ప్రయాణికుడిని పరీక్షించారు. అప్పటికే ప్రయాణీకుడు మరణించినట్లు వారు చెప్పారు. దీని తర్వాత ప్రయాణీకుడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి విడుదల చేసిన ఒక ప్రకటనలో.. 62 ఏళ్ల ప్రయాణికుడు కిడ్నీ వ్యాధి (సికెడి)తో బాధపడుతున్నట్లు తెలిపింది. ప్రయాణికుడు విమానంలోనే రక్తపు వాంతులు చేసుకున్నాడని, దాని కారణంగా అతను కొద్దిసేపటికే మరణించాడని చెప్పారు. తదుపరి విచారణ నిమిత్తం ప్రయాణికుని మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Also Read: MLC Kavitha: మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామని బిజెపి రెండుసార్లు మోసం చేసింది!
ఇద్దరు పైలట్లు కూడా..
విమానంలో ఇలా జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఇద్దరు పైలట్లు కూడా విమానంలోనే మరణించారు. కొద్ది రోజుల క్రితం నాగ్‌పూర్-పుణె విమానం ఎక్కే ముందు 40 ఏళ్ల పైలట్ విమానాశ్రయంలో మరణించాడు. మరణానికి కారణం గుండెపోటు. ఇది కాకుండా ఢిల్లీ-దోహా విమానంలో ఖతార్ ఎయిర్‌వేస్ పైలట్ విమానంలోనే మరణించాడు. విమాన ప్రయాణంలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. ఈ రెండు ఘటనల తర్వాత విమానయాన సంస్థలు ఒక ప్రకటన కూడా విడుదల చేశాయి.