Shopping Malls : దేశంలో ఉన్న షాపింగ్ మాల్స్ లో.. టాప్ 5 మాల్స్?
దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటిలో కొన్ని షాపింగ్ మాల్స్ గురించి తెల
- By Anshu Published Date - 04:35 PM, Mon - 18 September 23

దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రకాల షాపింగ్ మాల్స్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. వాటిలో కొన్ని షాపింగ్ మాల్స్ గురించి తెలిస్తే మాత్రం షాక్ అవ్వడం ఖాయం. మరి దేశంలోనే ఐదు అతిపెద్ద షాపింగ్ మాల్స్ గురించి ఎప్పుడైనా విన్నారా. ఒకవేళ తెలియకపోతే ఇప్పుడు మనం తెలుసుకుందాం…దేశంలోనే అతిపెద్ద షాపింగ్ మాల్ మన హైదరాబాద్ లోనే ఉంది. హైటెక్ సిటీ సమీపంలోని శరత్ సిటీ మాల్ దీని చిరునామా. దీని యజమాని శరత్ గోపాల్ బొప్పన్న. ఈ మాల్ ఏడు జోన్లుగా, ఆరు ఫోర్లలో విస్తరించి ఉంటుంది. 27,00,000 చదరపు అడుగుల పరిధిలోని ఈ మాల్ లో రిటైల్ స్పేస్ 19,31,000 చదరపు అడుగుల మేర ఉంది.
మిగిలినది పార్కింగ్ కోసం కేటాయించారు. ఇందులోనే షాపింగ్, డైనింగ్, వినోద సేవలు అందుబాటులో ఉంటాయి. ఏడు స్క్రీన్ల ఎఎంబీ సినిమాస్ కూడా ఇందులో ఉంది. అలాగే రెండో అతిపెద్ద మాల్ గా లక్నోలోని లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ను చెప్పుకోవచ్చు. అబుదాబికి చెందిన లులూ గ్రూప్ దీన్ని 2022లో ఏర్పాటు చేసింది. ఈ మాల్ 2.2 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. రూ.2,000 కోట్లతో ఈ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేశారు. 300కు పైగా దేశ, అంతర్జాతీయ బ్రాండ్లు ఇక్కడ విక్రయాలు నిర్వహిస్తున్నాయి. 1,600 సీట్ల ఫుడ్ కోర్ట్, 25 వరకు క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు కూడా ఇందులో ఉన్నాయి.

Cr 20230915tn65040e94b2f79
మూడవ షాపింగ్ మాల్ విషయానికి వస్తే.. ఢిల్లీలోని డీఎల్ఎఫ్ మాల్ మూడో స్థానంలో ఉంది. దీని విస్తీర్ణం 2 లక్షల చదరపు అడుగులు. 2016 ఫిబ్రవరిలో ఇది ప్రారంభమైంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడాకు సమీపంలో సెక్టార్ 18లో ఉంది. ఐదు జోన్లు, ఏడు అంతస్తుల్లో షాపింగ్ సేవలు ఉన్నాయి. రూ.1,800 కోట్లతో దీన్ని అభివృద్ధి చేశారు. అదేవిధంగా తిరువనంతపురంలోని లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ సైతం 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. గ్రౌండ్ కాకుండా, రెండు అంతస్తుల్లో ఏర్పాటు చేశారు. రూ.2,000 కోట్లతో ఈ షాపింగ్ మాల్ అభివృద్ధి చేశారు. 80,000 చదరపు అడుగుల ఇండోర్ స్టేడియం కూడా ఉంది.ఢిల్లీలోని సిటీవాక్ 1.3 మిలియన్ చదరపు అడుగుల పరిధిలో ఏర్పాటైంది. దీన్ని 2007లో ప్రారంభించారు. మొత్తం 54 ఎకరాల స్థలంలో, మూడు అంతస్తులుగా ఉంటుంది.