1st International Cruise Vessel : మన మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్రూయిజ్ నౌక
1st International Cruise Vessel : మనదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ వెసెల్ "MV ఎంప్రెస్" లాంచ్ అయింది. చెన్నై నుంచి శ్రీలంక మధ్య ఇది నడుస్తుంది.
- Author : Pasha
Date : 06-06-2023 - 9:26 IST
Published By : Hashtagu Telugu Desk
1st International Cruise Vessel : మనదేశపు మొట్టమొదటి అంతర్జాతీయ క్రూయిజ్ నౌక “MV ఎంప్రెస్” లాంచ్ అయింది. చెన్నై నుంచి శ్రీలంక మధ్య ఇది నడుస్తుంది. చెన్నై పోర్ట్, వాటర్‌వేస్ లీజర్ టూరిజం ప్రైవేట్ లిమిటెడ్ మధ్య 2022లో కుదిరిన ఒప్పందంలో భాగంగా ఈ క్రూయిజ్ సర్వీస్(1st International Cruise Vessel) సోమవారం స్టార్ట్ అయింది. ఈ క్రూయిజ్ సర్వీస్ శ్రీలంక లోని హన్బంతోట, ట్రింకోమలీ, కంకేసంతురీ ఓడరేవులను తన రూట్ లో కనెక్ట్ చేస్తుంది. MV ఎంప్రెస్ బోర్డులో టూర్ ప్యాకేజీలు 2 రాత్రులు, 3 రాత్రులు, 4 రాత్రులు, 5 రాత్రులు చొప్పున అందించబడతాయి. వీటిలో మనకు నచ్చిన టూర్ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. MV ఎంప్రెస్ క్రూయిజ్ ఐదు రోజులు సముద్రంలో ప్రయాణిస్తుంది. ఈ క్రూయిజ్ 2,880 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఒకేసారి ఇందులో 3,000 మంది జర్నీ చేయొచ్చు. అయితే మొదటి సర్వీస్ లో 750 మంది చెన్నై నుంచి శ్రీలంకకు వెళ్లారు .
Also read : Sleep Tourism: స్లీప్ టూరిజం పిలుస్తోంది..
రూ.17.21 కోట్ల వ్యయంతో చెన్నైలో నిర్మించిన అంతర్జాతీయ క్రూయిజ్ టూరిజం టెర్మినల్ నుంచి “MV ఎంప్రెస్” సర్వీసులు నడుస్తాయి. మన దేశంలో మరో 3 కొత్త అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్స్ 2024 నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. “MV ఎంప్రెస్”లాంటి క్రూయిజ్ షిప్‌ల సంఖ్య 2023లో 208కి .. 2030 నాటికి 500కి.. 2047 నాటికి 1100కి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. క్రూయిజ్ సేవలను పొందే ప్రయాణికుల సంఖ్య 2030 నాటికి 9.5 లక్షలకు.. 2047 నాటికి 45 లక్షలకు పెరిగే ఛాన్స్ ఉంది.