Indians in Forbes: ఫోర్బ్స్ జాబితాలో ఇండియన్స్ రికార్డు!
ఫోర్బ్స్ జాబితాలో ఎన్నడూ లేని విధంగా 169 మందికి చోటు దక్కింది.
- Author : Balu J
Date : 08-04-2023 - 11:21 IST
Published By : Hashtagu Telugu Desk
ఫోర్బ్స్ జాబితా అనగానే వివిధ దేశాల ధనవంతులు, సెలబ్రిటీలు మాత్రమే స్థానం దక్కించుకుంటారు. ఇండియాతో పోలిస్తే ఇతర దేశస్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ సారి మాత్రం ఇండియన్స్ ఇతర దేశస్తులను వెనక్కి నెట్టి ఎక్కువ స్థానాల్లో నిలిచారు. ఏకంగా ఫోర్బ్స్ జాబితాలో ఎన్నడూ లేని విధంగా 169 మందికి చోటు దక్కింది. భారత్‌లో ధనవంతుల జాబితాలో రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ (Mukhesh Ambani) అగ్రస్థానంలో నిలిచారు. గతేడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా ఎదిగిన గౌతమ్ అదానీ ఇప్పుడు 24 స్థానానికి పడిపోయిన విషయం తెలిసిందే.