Indian Win Spelling Bee : ఇండియా కుర్రాడికి అర కోటి.. స్పెల్లింగ్ బీలో గెలుపు
Indian Win Spelling Bee : అమెరికాలో "స్పెల్లింగ్ బీ" కాంపిటీషన్ కు యమ క్రేజ్ ఉంటుంది. అయితే ఈసారి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ లో మన ఇండియన్ కుర్రాడు మెరిశాడు. ఫ్లోరిడాలో నివసించే 14 ఏళ్ల భారత బాలుడు దేవ్ షా కొత్త చరిత్ర లిఖించాడు. గురువారం రాత్రి అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జరిగిన స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ ఫైనల్ లో విజయ ఢంకా మోగించాడు.
- Author : Pasha
Date : 02-06-2023 - 9:55 IST
Published By : Hashtagu Telugu Desk
Indian Win Spelling Bee : అమెరికాలో “స్పెల్లింగ్ బీ” కాంపిటీషన్ కు యమ క్రేజ్ ఉంటుంది.
అయితే ఈసారి స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ లో మన ఇండియన్ కుర్రాడు మెరిశాడు.
ఫ్లోరిడాలో నివసించే 14 ఏళ్ల భారత బాలుడు దేవ్ షా కొత్త చరిత్ర లిఖించాడు.
గురువారం రాత్రి అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జరిగిన స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ ఫైనల్ లో విజయ ఢంకా మోగించాడు.
ఫైనల్ రౌండ్ లో చివరి దశలో “సామోఫైల్” (Psammophile) అనే పదానికి సరిగ్గా స్పెల్లింగ్ చెప్పడం ద్వారా రూ.40 లక్షల (50,000 డాలర్లు) నగదు బహుమతిని దేవ్ షా గెల్చుకున్నాడు. దీంతో గత 24 సంవత్సరాలలో స్పెల్లింగ్ బీలో ఛాంపియన్ గా నిలిచిన దక్షిణాసియా ప్రాంతానికి చెందిన 22వ వ్యక్తిగా అతడు ఘనత సాధించాడు. ఈ ఏడాది అమెరికాలో నిర్వహించిన స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ కు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి 11 మిలియన్ల మంది అప్లై చేశారు. వారిలో 11 మంది మాత్రమే ఫైనల్స్ కు చేరారు. చివరకు ఆ ఫైనల్ ఉన్న వారిపై కూడా మన దేవ్ షా పైచేయి సాధించి విజేతగా(Indian Win Spelling Bee) నిలిచాడు.
Also read : Starbucks CEO: స్టార్‌బక్స్ సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్..!
వర్జీనియాకు చెందిన షార్లెట్ వాల్ష్ రెండో స్థానంలో నిలిచింది. నేషనల్ స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ 1925లో అమెరికాలో ప్రారంభమైంది. దీనిలో భారతీయ-అమెరికన్లు చాలా సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తున్నారు. ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొంటారు. గత ఏడాది కూడా టెక్సాస్‌కు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని, భారత బిడ్డ హరిణి లోగన్ విజేతగా నిలిచింది.