India vs Australia: రెండో ఇన్సింగ్స్ లో 163 పరుగులకు టీమిండియా ఆలౌట్!
- Author : Balu J
Date : 02-03-2023 - 5:09 IST
Published By : Hashtagu Telugu Desk
రెండో ఇన్నింగ్స్ లోనూ టీమిండియా ఆటతీరు మార్చుకోకుండా 163 పరుగులకే ఆలౌటై అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మొదటి ఇన్నింగ్స్ లో టీమిండియా 109 పరుగులు చేసి ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 197 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ లో కేవలం 75 పరుగులు చేస్తే మూడో టెస్టులో విజయం సాధిస్తుంది. నాథన్ లియోన్ ఏడు వికెట్లు పడగొట్టడం భారత్ త్వరగా పెవిలియన్ కు చేరుకోవాల్సి వచ్చింది. ఛెతేశ్వర్ పుజారా 59 పరుగులు చేశాడు. అయితే అతనికి ఇతర భారత బ్యాటర్ల నుండి ఎలాంటి సపోర్ట్ లేకపోవడంతో అత్యధిక స్కోర్ సాధించలేకపోయింది.