HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Sports
  • >India Demolish Nz By 168 Runs Win T20 Series

India Win T20 Series: టీమిండియానే అహ్మదా”బాద్‌ షా”… సిరీస్ కైవసం

సిరీస్ డిసైడర్‌లో టీమిండియా దుమ్మురేపింది... బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్ మెరుపు సెంచరీతో రెచ్చిపోతే... బౌలర్లు సమిష్టిగా చెలరేగిపోయారు.

  • Author : Naresh Kumar Date : 01-02-2023 - 10:22 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
IND vs WI Squad
Team India Win

Team India Win: సిరీస్ డిసైడర్‌లో టీమిండియా దుమ్మురేపింది… బ్యాటింగ్‌లో శుభ్‌మన్‌ గిల్ మెరుపు సెంచరీతో రెచ్చిపోతే… బౌలర్లు సమిష్టిగా చెలరేగిపోయారు. ఫలితంగా భారీస్కోరును ఛేదించే క్రమంలో కివీస్ చేతులెత్తేసింది. ఈ విజయంతో మూడు టీ ట్వంటీల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. న్యూ ఇయర్‌లో భారత్‌కు ఇది నాలుగో సిరీస్‌ విజయం. టాస్ గెలిచిన భారత్‌ బ్యాటింగ్‌లో ఓపెనర్ శుభ్‌మన్‌ గిల్ విశ్వరూపం చూపించాడు. బ్యాట్‌తో కివీస్ బౌలర్లపై నిర్థాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ వికెట్ కోల్పోయింది. మరోసారి అవకాశాన్ని వృథా చేసుకున్న ఇషాన్ కిషన్ 1 పరుగుకే ఔటయ్యాడు. తర్వాత శుభ్‌మన్‌ గిల్, రాహుల్ త్రిపాఠీ దూకుడుగా ఆడారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 80 పరుగులు జోడించారు. వన్‌డౌన్ బ్యాటర్ త్రిపాఠీ 22 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేశాడు. తర్వాత సూర్యకుమార్‌యాదవ్, పాండ్యా సహకారంతో గిల్ మరింతగా రెచ్చిపోయాడు. స్టేడియం నలువైపులా మెరుపు షాట్లు ఆడాడు. సూర్యకుమార్‌తో కలిసి 38 రన్స్‌ , పాండ్యాతో కలిసి 103 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. పాండ్యాతో కలిసి 103 రన్స్‌ను గిల్ 6.4 ఓవర్లలోనే సాధించాడంటే ఏ రేంజ్‌లో ఆడాడో అర్థం చేసుకోవచ్చు.

కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచిన గిల్ కేవలం 54 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ ట్వంటీల్లో అతనికిదే తొలి శతకం. కాగా అన్ని ఫార్మాట్లలోనూ శతకాలు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. గతంలో సురేశ్ రైనా, రోహిత్‌శర్మ , కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ మాత్రమే అన్ని ఫార్మాట్లలో సెంచరీలు చేసిన ఆటగాళ్ళు. ఇప్పుడు గిల్ కూడా వీరి సరసన చేరాడు. శతకం తర్వాత మరింతగా రెచ్చిపోయిన గిల్ సిక్సర్లు, ఫోర్లతో చెలరేగిపోయాడు. పాండ్యా కూడా ధాటిగా ఆడి 17 బంతుల్లోనే 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు. దీంతో భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 234 పరుగులు చేసింది. శుభ్‌మన్‌ గిల్ 63 బంతుల్లో 126 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. గిల్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 7 సిక్సర్లున్నాయి. ఓవరాల్‌గా కివీస్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు.

భారీ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో న్యూజిలాండ్ ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. భారత బౌలర్ల ధాటికి తొలి ఓవర్ నుంచే వికెట్లు కోల్పోయింది. 7 పరుగులకే టాపార్డర్‌ పెవిలియన్ చేరుకోగా.. మిగిలిన బ్యాటర్లు కూడా క్రీజులో నిలవలేదు. దీంతో కివీస్‌ ఇన్నింగ్స్‌కు 66 పరుగులకే తెరపడింది. డారెన్ మిఛెల్ , మిఛెల్ శాంట్నర్ మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. కివీస్ ఇన్నింగ్స్‌లో ఏడుగురు బ్యాటర్లు సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు. భారత బౌలర్లలో పాండ్యా 3 , శివమ్ మావి 2, అర్షదీప్‌సింగ్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమిండియా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తన టాప్ ప్లేస్‌ను మరింత పటిష్టం చేసుకుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Hardik Pandya
  • India beat NZ
  • India vs New Zealand
  • Shubman Gill
  • T20 series

Related News

Kuldeep Yadav Marriage

త్వరలో పెళ్లి పీటలెక్కనున్న టీమ్ ఇండియా ప్లేయర్..

Kuldeep Yadav Wedding  భారత క్రికెట్ అభిమానులకు ఒకేసారి రెండు శుభవార్తలు అందాయి. ఒకటి టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించడం కాగా, రెండోది జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పెళ్లి పీటలెక్కనుండటం. ఈ రెండు వార్తలతో దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగి

  • Gautam Gambhir replied to MS Dhoni's

    MS Dhoni : కోచ్ సాబ్.. మీ స్మైల్ సూపర్..ఎంఎస్ ధోనీ ఆసక్తికర పోస్ట్

  • T20 World Cup Final JioHotstar OTT viewership record

    భారత్-న్యూజిలాండ్ ఫైనల్ లో 82.2 కోట్ల వ్యూస్.. ఆల్‌టైమ్ రికార్డ్!

  • Hanuman Temple

    హనుమాన్ ఆలయంలో ట్రోఫీకి పూజలు చేయించిన గంభీర్, సూర్య

  • Hardik Pandya Dancing With GF Mahieka Sharma

    మహీకా వచ్చాక నా జీవితంలో వరుస విజయాలు : హార్దిక్ పాండ్యా

Latest News

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

  • Velugumatla Demolition : కూల్చడం ఎందుకు..? మళ్లీ ఇల్లు కట్టించుడు ఎందుకు..? భూదాన్ ఘటన పై కేటీఆర్ ఫైర్

  • Divorce : విడాకులు తీసుకున్న అల్లు అర్జున్ హీరోయిన్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd