Asian Games 2023 : Ind vs Afg.. ఫైనల్ మ్యాచ్ రద్దు స్వర్ణం గెలుచుకున్న భారత్..!
Asian Games 2023 ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల క్రికెట్ లో భారత్ ఆఫ్గాన్ ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా
- Author : Ramesh
Date : 07-10-2023 - 5:26 IST
Published By : Hashtagu Telugu Desk
Asian Games 2023 ఆసియా క్రీడల్లో భాగంగా పురుషుల క్రికెట్ లో భారత్ ఆఫ్గాన్ ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గాన్ 18.2 ఓవర్లలో వర్షం కారణంగా ఆట పూర్తయ్యే సరికి 112 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. వరుడు ఎంతకీ శాంతించకపోవడంతో మ్యాచ్ నిర్వహించడం సాధ్యం కాదని భారత్ ను విజేతగా ప్రకటించారు. దీనితో టీం ఇండియా ఆసియా క్రీడల్లో క్రికెట్ విభాగంలో కూడా మరో స్వర్ణ పతకం గెలుచుకుంది. అఫ్గాన్ రజతంతో సరిపెట్టుకుంది.
టీం ఇండియా మరో స్వర్ణం (Gold Medal) గెలవడం అభిమానులను ఆనందంలో ముంచెత్తుతుంది. టీ 20 ఫార్మాట్ లో నిర్వహించే ఈ టోర్నమెంట్ లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల దాటికి అఫ్గాన్ టాపార్డర్ బలయ్యారు. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయారు. ఆఫ్గాన్ ని క్లిష్ట పరిస్థితుల్లో షహిదుల్లా కమల్ 49 (43 బంతుల్లో), కెప్టెన్ గులాబదిన్ నయూబ్ 27 (24 బంతుల్లో) పరుగులతో ఇన్నింగ్స్ ని నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే వర్షం వల్ల ఆఫ్గాన్ ఫేట్ మార్చేసింది.
వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాగా ఐసీసీ ర్యాకింగ్స్ (ICC Rankings) లో అగ్ర స్థానంలో ఉన్న టీం ఇండియాకు స్వర్ణం వరించింది. ఇదే కాదు భారత మహిళా క్రికెట్ జట్టు కూడా గోల్డ్ మెడల్ సాధించింది. క్రికెట్ తో వచ్చిన రెండు స్వర్ణాలతో ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం 102 పతకాలు సాధించి నాలుగో ర్యాంకులో ఉంది.
Also Read : Rashmika : మరో కోటి పెంచిన రష్మిక..?
We’re now on WhatsApp. Click to Join