HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Speed News
  • >In The Kurnool Bus Accident How Well Did Those Mobiles Work

Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

  • By Vamsi Chowdary Korata Published Date - 09:48 AM, Sat - 25 October 25
  • daily-hunt
Kaveri Travels
Kaveri Travels

కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. ఈ బస్సు బైక్ను ఢీకొట్టి లాక్కెళ్లడంతో డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగిందని అనుమానించారు. అయితే తాజాగా మరో కీలక విషయం బయటపడింది. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో వందలాది మొబైల్ ఫోన్లు పేలడం వల్లే మంటలు తీవ్రమై, ఎక్కువ మంది చనిపోయారని ఫోరెన్సిక్ బృందాలు ప్రాథమికంగా నిర్ధారించాయి. ఆ ట్రావెల్స్ బస్సు ముందుగా ఒక బైక్ను ఢీకొట్టడంతో, దాని పెట్రోల్ ట్యాంక్ మూత ఊడిపోయి పెట్రోల్ కారడం మొదలైంది. ఆ బైక్ బస్సు కింద ఇరుక్కుపోయి కొంత దూరం లాక్కెళ్లడంతో నిప్పురవ్వలు చెలరేగి, పెట్రోల్ తోడవ్వడంతో మంటలు మొదలయ్యాయని భావిస్తున్నారు.

ఈ మంటలు ముందు బస్సులోని లగేజీ క్యాబిన్కు అంటుకున్నాయి. ఆ క్యాబిన్లో 400కు పైగా మొబైల్ ఫోన్లతో కూడిన పార్సిల్ ఉంది. ఎక్కువ వేడికి ఆ ఫోన్ల బ్యాటరీలు ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో మంటలు మరింత తీవ్రమై, లగేజీ క్యాబిన్ పైనున్న ప్రయాణికుల కంపార్ట్మెంట్లోకి వ్యాపించాయంటున్నారు. ఈ ప్రమాదం వల్ల లగేజీ క్యాబిన్కు సరిగ్గా పైన ఉన్న సీట్లలో, బెర్తుల్లో ఉన్న ప్రయాణికులకు తప్పించుకునే అవకాశం లేకుండా పోయిందని భావిస్తున్నారు. అందుకే బస్సు ముందు భాగంలో ఉన్నవారే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారని ఫోరెన్సిక్ బృందాలు అనుమానిస్తున్నాయి. ప్రమాద స్థలాన్ని, దగ్ధమైన బస్సును పరిశీలించిన తర్వాత ఈ విషయాలను ప్రస్తావించారు.

లగేజీ క్యాబిన్లో బ్యాటరీలు పేలడంతో బస్సులో భారీ శబ్దం వచ్చింది. డ్రైవర్ వెంటనే బస్సును ఆపి తన సీటు పక్కన ఉన్న కిటికీ డోరులోంచి బయటకు దిగి, బస్సు వెనక వైపునకు వెళ్లి చూసి అక్కడి నుంచి పారిపోయాడు. బస్సు దట్టమైన పొగ, మంటల్లో చిక్కుకుంది. లోపల చిక్కుకున్న ప్రయాణికులు బయటపడటానికి ప్రయత్నించినా, కుడివైపు ఎమర్జెన్సీ డోర్ తెరుచుకోకపోవడంతో బయటకు రాలేకపోయారు. వాస్తవానికి ప్రయాణికుల బస్సుల్లో మొబైల్ ఫోన్ల వంటి సరకులను తీసుకెళ్లకూడదు. ప్రయాణికుల వాహనాల్లో వ్యక్తిగత లగేజీ తప్ప ఇతర సరకులు రవాణా చేయకూడదనే నిబంధన ఉన్నప్పటికీ, ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తూ, సరకులను లగేజీ క్యాబిన్లలో పెడుతున్నాయి. దీనివల్ల ప్రమాదాలు జరిగినప్పుడు మంటలు అంటుకుని, ప్రాణనష్టం పెరుగుతోంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • bus fire accident
  • Kurnool Bus Accident
  • Kurnool Bus Fire

Related News

Kurnool Bus Tragedy

Rashmika Mandanna : కర్నూలు బస్సు ప్రమాదంపై రష్మిక శాడ్ పోస్ట్..!

కర్నూలు బస్సు ప్రమాద ఘటన అందరినీ కలచి వేస్తోంది. నగర శివార్లలోని చిన్నటేకూరు సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అగ్ని ప్రమాదానికి గురైన ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. ఈ దుర్ఘటన ఎన్నో కుటుంబాల్లో విషాదం నింపింది. నిద్రలోనే ప్రాణాలు కోల్పోయిన వారికి సెలబ్రిటీలు సంతాపం తెలుపుతున్నారు. రష్మిక మందన, కిరణ్ అబ్బవరం , సోనూ సూద్ వంటి సినీ ప్రముఖులు ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశార

  • Kurnool Bus Fire Accident

    Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!

  • Chandrababu

    CM Chandrababu Naidu : కర్నూల్ బస్ ప్రమాదం చంద్రబాబు సీరియస్ ..వారిపై కఠిన చర్యలు.!

  • Bus Accident's

    Bus Accident’s : సరిగ్గా 12 ఏళ్ల తర్వాత ‘పాలెం’ ఘటన రిపీట్.. మృత్యు రహదారి నేషనల్ హైవే 44..!

  • Kurnool Bus Fire Accident

    Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది ఫోన్లు స్విచాఫ్.. ఏమయ్యారు?

Latest News

  • Shiva : శివ’ రీ-రిలీజ్… రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్నహీరో అల్లు అర్జున్!

  • Iphone : 2026లో యాపిల్ ఫోల్డబుల్ ఐఫోన్..!

  • ODI Cricketers: టీమిండియా టాప్‌-5 వ‌న్డే ఆట‌గాళ్లు వీరే!

  • viral Video : రైలులోని టాయిలెట్ ను బెడ్ రూమ్ గా మార్చేసుకున్న ప్రయాణికుడు

  • Google Chrome: గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? ఇక‌పై జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే!

Trending News

    • Kurnool Bus Fire Accident : కర్నూలు బస్సు ప్రమాదం లో .. ఆ మొబైల్స్ ఎంత పనిచేశాయి!

    • ఈ 6 రాశుల వారికి అప్పులిస్తే జాగ్రత్త..! తిరిగి డబ్బులు రావడం కష్టమే అంటున్నారు జ్యోతిష్య నిపుణులు

    • Five Habits: మీలో కూడా ఈ ఐదు అలవాట్లు ఉన్నాయోమో చెక్ చేసుకోండి!

    • Virat Kohli: ఆస్ట్రేలియాపై విరాట్ కోహ్లీ ప‌ట్టు త‌గ్గిపోయిందా? గ‌ణాంకాలు ఇవే!

    • Credit Card: క్రెడిట్ కార్డు భద్రత: 6 ముఖ్యమైన రహస్యాలు మీ కార్డును రక్షించుకోండి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd