IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థిని ఆత్మహత్యా
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమె హాస్టల్ ప్రాంగణంలో సూసైడ్ చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది.
- Author : Praveen Aluthuru
Date : 17-06-2024 - 7:02 IST
Published By : Hashtagu Telugu Desk
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కేరళకు చెందిన దేవిక పిళ్లై అనే విద్యార్థిని బయోసైన్స్ చదువుతోంది. ఈ ఉదయం ఆమె హాస్టల్ ప్రాంగణంలో సూసైడ్ చేసుకున్నట్లు యాజమాన్యం తెలిపింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఖరగ్‌పూర్ సబ్-డివిజనల్ ఆసుపత్రికి తరలించారు.
విద్యార్థిని సూసైడ్ తో క్యాంపస్ సెక్యూరిటీ మరియు వైద్య బృందాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఆమె కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించారు. పోలీసులు క్షుణ్ణంగా విచారణ జరుపుతున్నారు… ఐఐటి యూనివర్సిటీ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు.
ఇన్స్టిట్యూట్ యాజమాన్యం తెలిపిన వివరాల ప్రకారం దేవిక పిళ్లై విద్యాపరంగా ప్రతిభావంతులైన విద్యార్థిని. ఆమె బయోసైన్సెస్ మరియు బయోటెక్నాలజీ రంగంలో ఆమెకు మంచి భవిష్యత్తు ఉందని ఇన్‌స్టిట్యూట్ తెలిపింది. ఆమె బయోసైన్స్ మరియు బయోటెక్నాలజీ డిపార్ట్‌మెంట్ ఇన్‌చార్జ్ ప్రొఫెసర్ కింద సమ్మర్ ఇంటర్న్‌షిప్ చదువుతోంది. ఈ విషాద సంఘటనతో దేవిక పిళ్లై కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. ఏలారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె మరణం ఆ తల్లిదండ్రులకు తీరాలని లోటు అనే చెప్పాలి.
Also Read: Green Tomatoes: పచ్చి టమాట వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాల గురించి మీకు తెలుసా?